హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Account: సేవింగ్స్ అకౌంట్లపై ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు

Savings Account: సేవింగ్స్ అకౌంట్లపై ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆయా బ్యాంకుల్లో పొదుపు చేయాలనే నియమం ఏమీ లేదు. నగరాల్లో దీర్ఘకాలిక ట్రాక్ రికార్డ్ ఉండే బ్యాంకులు, మెరుగైన సేవలు అందించేవి, ఎక్కువ బ్రాంచులు, నెట్‌వర్క్ ఉండేవి, విస్తృతమైన ఏటీఎం సేవలు అందించే బ్యాంకులను ఎంచుకోవడం మంచిది.

ఇంకా చదవండి ...

చాలామంది వినియోగదారులు ఒకటికంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లను వాడతారు. ఒక సేవింగ్స్ అకౌంట్‌ను జీతం, డిపాజిట్లు, పెట్టుబడులకు పరిమితం చేస్తారు. మరొకదాన్ని రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, నెలవారీ ఖర్చులు... వంటివి చెల్లించడానికి ఉపయోగిస్తారు. అత్యవసర నిధులను దాచుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ ఉపయోగపడుతుంది. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ అకౌంట్లలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే కొన్ని చిన్న, కొత్త ప్రైవేట్ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అందువల్ల ఎక్కువ రోజులు సేవింగ్స్ అకౌంట్లో డబ్బు దాచాలనుకునేవారు ఇలాంటి బ్యాంకులు అందించే వడ్డీ రేట్లపై దృష్టి పెట్టడం మంచిది.

అధిక వడ్డీ రేట్లు పొందవచ్చు


సేవింగ్స్ అకౌంట్లలో చేసే డిపాజిట్లపై కొత్త ప్రైవేట్ బ్యాంకులైన బంధన్ బ్యాంకు 7.15 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయని బ్యాంక్ బజార్ నివేదిక చెబుతోంది. ఇతర ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులకు 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల మాదిరిగా ఈ బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏడు శాతం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రముఖ ప్రైవేటు, పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు కేవలం మూడు నుంచి 3.5 శాతం వరకు మాత్రమే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.70 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.75 శాతం వడ్డీని మాత్రమే అందిస్తున్నాయి.

Bank Account: అలర్ట్... బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు డిసెంబర్ 31 లోగా ఈ పని చేయాల్సిందే

SBI Alert Message: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఈ 5 తప్పులు చేయొద్దంటున్న బ్యాంకు

మినిమం బ్యాలెన్స్ ఎక్కువ


ప్రైవేట్ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ రూ.500 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు బ్యాంకుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. నెలవారీ జీతాలు అందుకునే మధ్యతరగతి ప్రజలు, స్వయం ఉపాధి పొందే వారిని ఆకర్షించేందుకు ఈ బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ రూ.10,000గా ఉంది. బంధన్ బ్యాంకులో రూ.5,000 వరకు కనీస నిల్వలు తప్పనిసరిగా ఉంచాల్సిందే. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ రూ.2,500,హెచ్‌డీఎఫ్‌సీలో రూ.10,000గా ఉంది.

Dhanteras 2020: ధంతేరాస్‌కి నగలు కొంటున్నారా? గోల్డ్ హాల్‌మార్క్ గురించి తెలుసుకోండి

Gold Scheme: గోల్డ్ స్కీమ్‌లో డబ్బులు కడుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి

బ్యాంకుల గురించి ఆరా తీయాలి


వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆయా బ్యాంకుల్లో పొదుపు చేయాలనే నియమం ఏమీ లేదు. నగరాల్లో దీర్ఘకాలిక ట్రాక్ రికార్డ్ ఉండే బ్యాంకులు, మెరుగైన సేవలు అందించేవి, ఎక్కువ బ్రాంచులు, నెట్‌వర్క్ ఉండేవి, విస్తృతమైన ఏటీఎం సేవలు అందించే బ్యాంకులను ఎంచుకోవడం మంచిది. సేవింగ్స్ అకౌంట్లపై వినియోగదారులకు లభించే వడ్డీని బోనస్‌గా భావించాలి. ఈ డేటా కోసం BSEలో నమోదైన ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లనే బ్యాంక్ బజార్ సేకరించింది. ఇతర బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచని డేటాను సేకరించలేదు.

First published:

Tags: Bank, Bank account, Banking, HDFC bank, Save Money, State bank of india

ఉత్తమ కథలు