IDBI BANK REVISES FIXED DEPOSIT FD RATES LATEST FD RATES HERE MK GH
IDBI Bank: ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించిన ఐడీబీఐ బ్యాంక్.. తాజా వడ్డీ రేట్లను పరిశీలించండి
(ప్రతీకాత్మక చిత్రం)
ఐడీబీఐ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఎఫ్డీ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. ఈ నూతన వడ్డీ రేట్లు ఇప్పటికే (జూలై 14 నుంచి) అమల్లోకి వచ్చాయి.
ఐడీబీఐ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఎఫ్డీ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. ఈ నూతన వడ్డీ రేట్లు ఇప్పటికే (జూలై 14 నుంచి) అమల్లోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ నూతన వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ పేర్కొంది. కాగా, ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తాయి. ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8% వరకు వడ్డీ రేట్లను అమలు చేస్తుంది.
ఎఫ్డీలపై తాజా వడ్డీ రేట్లు ఇవే..
ఐడీబీఐ బ్యాంక్ కనిష్టంగా 7 రోజుల నుంచి గరిష్టంగా 20 సంవత్సరాల మెచ్యూరిటీతో ఫిక్స్డ్ డిపాజిట్లను అమలు చేస్తుంది. ఇది 7 నుంచి 14 రోజులు, 15 నుండి 30 రోజుల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% వడ్డీని అందిస్తోంది. 31 నుంచి 45 రోజుల మెచ్యూరిటీ గల ఎఫ్డీలపై 2.8% వడ్డీని అమలు చేస్తుంది. ఇక, 31 నుంచి 45 రోజుల మెచ్యూరిటీ గల ఎఫ్డీలపై ఈ బ్యాంక్ 2.8 శాతం వడ్డీ, 46 నుంచి 90 రోజుల మెచ్యూరిటీ తీరే ఎఫ్డీలపై 3 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. 91 రోజుల నుంచి 6 నెలల మధ్య మెచ్యూరిటీ తీరే ఎఫ్డిలపై 3.5% వడ్డీ అమలు చేస్తుంది.
ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం మధ్య మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డీలపై 4.3% వడ్డీ ప్రయోజనాలు పొందవచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల ఎఫ్డీలు 5.1% వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇక, ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాల ఎఫ్డిలపై 5.25% వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. చివరగా 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డిలపై 4.8% వడ్డీ రేటు అందజేస్తుంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ అందిస్తున్నట్లు ఐడీబీఐ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు 3.2% నుంచి 5.3% వరకు వడ్డీ రేట్లను అమలు చేస్తున్నట్లు ఐడీబీఐ బ్యాంక్ స్పష్టం చేసింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.