హోమ్ /వార్తలు /బిజినెస్ /

IDBI FD: ఐడీబీఐ నుంచి స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌.. వడ్డీరేటు ఎంతంటే..

IDBI FD: ఐడీబీఐ నుంచి స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌.. వడ్డీరేటు ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IDBI FD: IDBI బ్యాంక్ అందించే 500 రోజుల అమృత్ మహోత్సవ్ FD స్కీమ్ ఆగస్టు 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 సెప్టెంబర్ 30న ఆఫర్ ముగుస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) మరో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ (New Fixed Deposit Scheme)ను లాంచ్ చేసింది. 500 రోజుల మెచ్యూరిటీతో "అమృత్ మహోత్సవ్ FD" (Amrit Mahotsav FD) అనే లిమిటెడ్ టైమ్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ బ్యాంక్ అందిస్తున్న 1100 రోజుల అమృత్ మహోత్సవ్ FD స్కీమ్‌ను 2022 ఆగస్టు 22న క్లోజ్ చేసింది. అయితే దీన్ని 500 రోజులకు, 6.70% వరకు వడ్డీ రేటుతో పునరుద్ధరించింది.ఈ వివరాలను IDBI బ్యాంక్ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది “IDBI బ్యాంక్ అందిస్తున్న అమృత్ మహోత్సవ్ రిటైల్ టర్మ్ డిపాజిట్లతో గరిష్ట వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్ 2022 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది." అని ట్వీట్‌లో పేర్కొంది.


IDBI బ్యాంక్ అందించే 500 రోజుల అమృత్ మహోత్సవ్ FD స్కీమ్ ఆగస్టు 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 సెప్టెంబర్ 30న ఆఫర్ ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో కాలబుల్ డిపాజిట్ల కింద బ్యాంకు 6.10% వడ్డీని, నాన్-కాలబుల్ డిపాజిట్లకు 6.20% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.


సాధారణ కస్టమర్లు (NRE/NROతో సహా) చేసిన నాన్-కాలబుల్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు కాలబుల్ డిపాజిట్లపై 6.60%, నాన్-కాలబుల్ డిపాజిట్లపై 6.70% వడ్డీ పొందుతారు. కాలబుల్ డిపాజిట్లను మెచ్యూరిటీ తేదీకి ముందు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే నాన్-కాలబుల్ డిపాజిట్లను మెచ్యూరిటీ తేదీకి ముందు విత్‌డ్రా చేయలేరు.‘సీనియర్ సిటిజన్లకు 0.50% సాధారణ మార్క్-అప్ రేటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిటైర్డ్ సీనియర్ సిటిజన్లకు 1% సాధారణ మార్క్-అప్ అందుబాటులో ఉంటుంది’ అని IDBI బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొంది.


* అమృత్ మహోత్సవ్ FDకి సంబంధించిన నిబంధనలు, షరతులు


1. నాన్-కాలబుల్ డిపాజిట్ల విషయంలో ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రా/క్లోజింగ్ సదుపాయం ఉండదు.


2. 500 రోజులు, 1100 రోజుల ‘అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్’ స్కీమ్‌కు నమన్ సీనియర్ సిటిజన్ రేట్లు వర్తించవు.


3. లోన్/ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ విషయంలో వడ్డీని క్రమం తప్పకుండా రీపేమెంట్ చేయడంలో కస్టమర్ విఫలమైన సందర్భంలో.. వారి నాన్-కాలబుల్ FDని ముందుగానే మూసివేసే హక్కు బ్యాంక్‌కి ఉంటుంది.


4. స్టాఫ్ & సీనియర్ సిటిజన్ రేట్లు NRO & NRE టర్మ్ డిపాజిట్లకు వర్తించవు.


5. టర్మ్ డిపాజిట్లకు సంబంధించిన ఇతర ఫీచర్లు, నిబంధనలు, షరతులు మారవు.. తాజా స్కీమ్‌కు కూడా ఇవే వర్తిస్తాయి.


ఇది కూడా చదవండి : మీ సిబిల్ స్కోర్ ఎంత? సింపుల్‌గా ఉచితంగా చెక్ చేయండి ఇలా


* IDBI బ్యాంక్ FD రేట్లు
రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆగస్టు 22న ప్రకటించింది ఐడీబీఐ బ్యాంకు . ఇప్పుడు 7 రోజుల నుంచి 30 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు పాత 2.70% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. అయితే 31-45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 3% నుంచి 3.35%కి పెంచింది. 46-60 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 3.25% నుంచి 3.75%కి పెంచింది. 61-90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 3.40% నుంచి 4.00%కి పెంచింది. మరిన్ని వివరాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Fixed deposits, IDBI Bank, Interest rates, Personal Finance

ఉత్తమ కథలు