HOME » NEWS » business » IDBI BANK AND CANARA BANK OFFER THE BEST RATES ON SAVINGS ACCOUNTS AMONG PUBLIC SECTOR BANKS MS GH

Savings Account Deposits: పొదుపు ఖాతాల డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లించే బ్యాంకులివే..

Fixed Deposits తో పోలిస్తే Savings Accounts లో ఉంచే డబ్బుపై వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని కొత్త, ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. సేవింగ్స్ బ్యాంక్‌లో ఉంచే నిధులపై ఏయే బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయో తెలుసుకొని, వాటిల్లో డిపాజిట్లు చేయడం మంచిది.

news18
Updated: November 27, 2020, 7:30 PM IST
Savings Account Deposits: పొదుపు ఖాతాల డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లించే బ్యాంకులివే..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 27, 2020, 7:30 PM IST
  • Share this:
సాధారణంగా ఉద్యోగాలు చేసేవారు ఒకటికంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లను తీసుకుంటారు. ఒక సేవింగ్స్ అకౌంట్‌తో డిపాజిట్లు, పెట్టుబడులు వంటివి చేస్తారు. మరొకటి సాధారణ అవసరాలైన నెలవారీ ఖర్చుల కోసం, లోన్ వాయిదాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించడానికి వాడతారు. అత్యవసర నిధులు పక్కన పెట్టుకోవడానికి కూడా సేవింగ్స్ అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ అకౌంట్లలో ఉంచే డబ్బుపై వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని కొత్త, ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. అందువల్ల సేవింగ్స్ బ్యాంక్‌లో ఉంచే నిధులపై ఏయే బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయో తెలుసుకొని, వాటిల్లో డిపాజిట్లు చేయడం మంచిది.

సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఐడిబిఐ బ్యాంక్ 3.5 శాతం, కెనరా బ్యాంక్ 3.2 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నట్టు బ్యాంక్‌బజార్ డేటా చెబుతోంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీ కూడా ఇంత వరకే ఉంటుంది. ఉదాహరణకు హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకులు మూడు నుంచి 3.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కానీ పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం చాలా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.7 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.75 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఎక్కువ. ఈ డిపాజిట్లపై AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏడు శాతం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

Minimum Balance తక్కువ...
ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లలో మినమం బ్యాలెన్స్ రూ.250 నుంచి మొదలవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది మారుతుంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లో ఉంచాల్సిన మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రభుత్వ బ్యాంకులు సాధారణ ప్రజలకు, తక్కువ ఆదాయం ఉన్న వారికి బ్యాంకింగ్ సేవలందించాలనే లక్ష్యంతో పనిచేస్తాయి. అందువల్ల వాటిలో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లలో మినిమం బ్యాలెన్స్ రూ.2,500 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంకులో ఇది రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.

ఎలాంటి బ్యాంకులను ఎంచుకోవాలి?
సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ల కోసం నగరాల్లో లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్, ఎక్కువ బ్రాంచ్ నెట్‌వర్క్, ఎక్కువ ఏటిఎం సెంటర్లు నిర్వహించే బ్యాంకులను ఎంచుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్‌పై వినియోగదారుడికి అందే వడ్డీ బోనస్ కిందకు వస్తుంది. వడ్డీ రేట్లను పోల్చడానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదైన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సమాచారాన్నే బ్యాంక్ బజార్ పరిగణనలోకి తీసుకుంది. బ్యాంకు వెబ్‌సైట్‌లలో దీనికి సంబంధించిన డేటాను అందుబాటులో ఉంచని బ్యాంకుల వివరాలు తీసుకోలేదు.
Published by: Srinivas Munigala
First published: November 27, 2020, 7:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading