Covid 19: కరోనా నుంచి కోలుకున్నామని నిర్లక్ష్యంగా ఉన్నారా.. ICMR హెచ్చరిక ఇదే...

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి శరీరంలో సాధారణంగా మూడు నుండి ఐదు నెలల వరకు యాంటీ బాడీలు కొనసాగుతాయని, ఆ తర్వాత కరోనా తిరిగి ఎటాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది.

news18-telugu
Updated: October 21, 2020, 4:39 PM IST
Covid 19: కరోనా నుంచి కోలుకున్నామని నిర్లక్ష్యంగా ఉన్నారా.. ICMR హెచ్చరిక ఇదే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
గత ఆరు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో ప్రపంచం నెమ్మదిగా కోలుకుంటోంది. అయితే, ప్రస్తుతం కేసులు తక్కువగా నమోదవుతున్నంత మాత్రాన మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కాదు అని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది. కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి తగ్గనట్లే తగ్గి రెండోసారి తిరిగి విజృంభిస్తోందని గుర్తుచేస్తుంది. కరోనా ఒకసారి వచ్చి తగ్గిపోయిన వారికి మరలా సోకదు అనుకుంటే పొరపాటేనని, కోలుకున్న తర్వాత కూడా మరలా సోకే అవకాశాలు లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి శరీరంలో సాధారణంగా మూడు నుండి ఐదు నెలల వరకు యాంటీ బాడీలు కొనసాగుతాయని, ఆ తర్వాత కరోనా తిరిగి ఎటాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై ఐసిఎంఆర్ ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘‘కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కూడా ఇతరుల లాగే ఫేస్ మాస్క్‌లు ధరించడం కొనసాగించాలి.

కోవిడ్–19 ఎంత మందికి సోకింది, తరువాత నెగెటివ్గా మారి, మళ్ళీ పాజిటివ్‌గా ఎంతమందికి వచ్చింది అనే విషయంపై డేటాను పరిశీలిస్తున్నాము.” అని అన్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి 90 రోజుల తరువాత మరోసారి పాజిటివ్ వస్తే దానిని రీఇన్ఫెక్షన్గా పిలుస్తారని చెప్పారు. ఇలాంటి రీఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచం మొత్తం మీద చాలానే నమోదవుతున్నాయని తెలిపారు.

కోవిడ్–19 ప్రపంచ మానవాళికి ఒక కొత్త వ్యాధి కనుక దీనికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం పరిమితంగా ఉందని. కరోనా సోకిన వ్యక్తి కోలుకున్న తర్వాత అతని శరీరంలో యాంటీబాడీస్ తగ్గితే, కోవిడ్–19  తిరిగి సంక్రమించే అవకాశం ఉంది. అందుకే కరోనా వైరస్ కట్టడికి ఫేస్ మాస్క్లు ధరించడం మరియు సోషల్ డిస్టన్స్ పాటించడం తప్పనిసరి అని, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని" అని ఆయన పేర్కొన్నారు.
Published by: Krishna Adithya
First published: October 21, 2020, 4:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading