ICICI SECURITIES SEES STRENGTH IN ULTRATECH CEMENT SHARES WHY BROKERAGE IS BULLISH MK
UltraTech Cement Share: మోదీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులతో 2022లో లాభం పొందే స్టాక్ ఇదే..
ప్రతీకాత్మకచిత్రం
UltraTech Cement share : మన దేశంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. కోవిడ్ అనంతరం అటు మౌలికరంగంతో పాటు హౌజింగ్, ప్రాజెక్టులు సైతం ఊపందుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, చిన్న పట్టణాల్లో మెట్రోలు వంటి వాటితో సిమెంట్ సహా ఇతర నిర్మాణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పుంజుకుంది.
UltraTech Cement share : మన దేశంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. కోవిడ్ అనంతరం అటు మౌలికరంగంతో పాటు హౌజింగ్, ప్రాజెక్టులు సైతం ఊపందుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, చిన్న పట్టణాల్లో మెట్రోలు వంటి వాటితో సిమెంట్ సహా ఇతర నిర్మాణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే సిమెంట్ రంగానికి చెందిన స్టాక్స్ కూడా జోరందుకోనున్నాయి. తాజాగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సైతం అల్ట్రాటెక్ (UltraTech) సిమెంట్ షేర్ టార్గెట్ ఏకంగా రూ. 8,850గా నిర్ణయిస్తూ బై కాల్ ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు షేరు 0.21 శాతం లాభంతో రూ.7,422 వద్ద ట్రేడవుతుండటం విశేషం.
ముఖ్యంగా కంపెనీ తన కార్యకాలపాలను విస్తరించడంతో పాటు, UltraTech FY21-24లో వృద్ధిరేటు కొనసాగిస్తుందని, లాభదాయకతను నిలుపుకుంటుందని ICICI సెక్యూరిటీస్ ఆశిస్తోంది. ఇక కంపెనీ సానుకూలతల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కంపెనీకి మంచి మార్కెట్, ప్రీమియం బ్రాండ్, బలమైన పంపిణీ వ్యవస్థతో పాటుగా, నాన్-ట్రేడ్ సెగ్మెంట్లలో సైతం బలంగా చొచ్చుకుపోవటం ప్రధాన పాజిటివ్స్ గా చెప్పవచ్చు. అలాగే పలు అంశాల్లో మార్కెట్లోని ఇతర సిమెంట్ సంస్థల కన్నా కూడా అగ్రస్థానంలో నిలిచింది.
ఇక మార్కెట్లో అల్ట్రాటెక్ (UltraTech) సిమెంట్ సేల్స్ విషయానికి వస్తే అటు దేశంలోని తూర్పు, మధ్య, ఉత్తర భారత మార్కెట్లలో మంచి వృద్ధిని కనబరుస్తోంది. అంతేకాదు వచ్చే రెండు మూడు సంవత్సరాలలో 20 MNTE సామర్థ్యానికి పెంచుకోవాలని అల్ట్రాటెక్ (UltraTech) ఆశిస్తోంది. ఇది దేశీయంగా ఉత్పత్తి అయ్యే సిమెంటులో 18 శాతంతో సమానం. అంతేకాదు 70 శాతం విస్తరణ దిశగా అడుగులు వేయడంతో పాటు, టన్నుకు 60 డాలర్ల కంటే తక్కువ Capital expenditureతో, మెరుగైన లాభదాయకత పొందేలా ప్రయత్నిస్తోంది.
డెట్ ఫ్రీ కంపెనీ దిశగా అడుగులు
అంతేకాదు కంపెనీ తీసుకుంటున్న పొదుపు చర్యల కారణంగా, 2024 నాటికి టన్నుకు రూ. 100 లాభాన్ని పొందే అవకాశం ఉంది. FY20లో డివిడెండ్ చెల్లింపు నిష్పత్తి 10 శాతం నుండి FY21లో 20 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో ఇది మరింత పెరగవచ్చు, FY21-24 సమయంలో UltraTech రూ. 20,000 కోట్ల క్యాష్ ఫ్లో ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది.2024 నాటికి కంపెనీ నిర్వహణ ఇదే స్థాయిలో కొనసాగితే క్యాష్ ఫ్లో రూ. 34,000 కోట్లకు చేరే వీలుంది. 2023 మొదటి సగం నాటికి కంపెనీ డెట్ ఫ్రీ (రుణ విముక్తం) అవుతుందని అంచనా వేస్తున్నారు.
Disclaimer: పైన పేర్కొన్నటు వంటి స్టాక్స్ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే, మీ పెట్టుబడులకు న్యూస్ 18 తెలుగు, యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ధృవీకరించబడిన నిపుణులను సంప్రదించమని సలహా.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.