Insurance | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా కొత్త పాలసీని తీసుకువచ్చింది. ఇది సేవింగ్స్ ప్రొడక్ట్. దీని పేరు ఐసీఐసీఐ (ICICI) ప్రు సుఖ్ సమృద్ధి. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ పేర్కొంటోంది. గ్యారంటీ రిటర్న్, కుటుంబానికి ఆర్థిక భద్రత వంటివి లభిస్తాయి. స్కీమ్ (Scheme) గడువు ఉన్నంత వరకు పాలసీ కవరేజ్ లభిస్తుంది.
అంతేకాకుండా ఐసీఐసీఐ ప్రు సుఖ్ సమృద్ధి స్కీమ్ ద్వారా మహిళలకు అధిక మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. మహిళలను ప్రోత్సహించడానికి ఇలాంటి ప్రయోజనాన్ని అందుబాటులో ఉంచారు. మహిళల్లో పొదుపు పెంచాలని యోచనతో వారి ఆర్థిక స్వతంత్ర్యం లక్ష్యంగా అధిక బెనిఫిట్స్ కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా ఈ స్కీమ్‌లో రెండు రకాలు ఉంటాయి. ఇన్కమ్, లంప్సమ్ అనేవి రెండు రకాలు.
ఒక్క షేరుకు ఉచితంగా 6 షేర్లు.. ఈ స్టాక్‌కు భలే డిమాండ్, కొనేందుకు పోటీ!
ఐసీఐసీఐ ప్రు సుఖ్ సమృద్ధి ఇన్కమ్ ఆప్షన్ కింద చూస్తే.. పాలసీదారుడు ట్యాక్స్ లేకుండా అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పిల్లల చదువు, వెకేషన్స్, ఇతర అవసరాల కోసం ఈ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. పాలసీ కొనుగోలు సమయంలో ఈ ఆప్షన్ కింద ఎంత కాలం వరకు ఇన్కమ్ పొందాలనే అంశాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి డబ్బు పొందొచ్చు.
బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఎక్కడైనా ఒకే రేటు!
అంతేకాకుండా ఈ స్కీమ్‌లో మరో రెండు ఫీచర్లు కూడా ఉన్నాయి. సేవింగ్స్ వాలెట్ అనేది ఒకటి .దీని కింద డబ్బులు పొదుపు చేసుకొని అవసరం అయినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. సేవ్ ద డేట్ ఫీచర్ కూడా ఉంది. డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజునే డబ్బులు చెల్లిస్తారు. అంటే పెళ్లి రోజు, పిల్లల బర్డ్ డే ఇలా స్పెషల్ అకేషన్స్ రోజున డబ్బులు పొందొచ్చు.
ఇక ఐసీఐసీఐ ప్రు సుఖ్ సమృద్ధి లంప్ సమ్ ఆప్షన్ విషయానికి వస్తే.. దీర్ఘకాలంలో డబ్బులు కూడబెట్టాలని భావించే వారికి ఇది అనువుగా ఉంటుంది. ఇంటి కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు వంటి వాటికి ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒకేసారి భారీ మొత్తాన్ని పొందొచ్చు. అంతేకాకుండా వార్షిక బోనస్‌లు కూడా ఉంటాయి. అయితే కంపెనీ ప్రకటించినప్పుడే వీటిని పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఈ స్కీమ్‌లో చేరడం వల్ల రాబడితో పాటు రక్షణ కూడా లభిస్తుంది. కస్టమర్ల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Icici, Icici bank, New scheme