పదవీ విరమణ తర్వాత కూడా ప్రతినెలా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే అద్భుతమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారెంటెడ్ పెన్షన్ ప్లాన్ పేరుతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. డిఫర్ట్, ఇమ్మిడియేట్ యాన్యుటీ విధానాలను కలిపి పెట్టుబడులపై కచ్చితమైన రిటర్న్స్ వచ్చే విధంగా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ప్రకారం, ఈ లైఫ్ పెన్షన్ ప్లాన్ పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్లుగా క్రమమైన ఆదాయాన్ని ఇస్తుంది. దీని కింద మీ పెట్టుబడి ఐదేళ్ల వ్యవధి తరువాత రెండింతలు, పదకొండేళ్ల తర్వాత మూడింతలు పెరుగుతుంది. ఇది పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా పాలసీదారులను రక్షించే పాలసీ అని ఐసీఐసీఐ స్పష్టం చేసింది. ఈ యాన్యుటీ ప్రొడక్టులు పాలసీదారులకు వారి పదవీ విరమణ అనంతరం ఉపయోగపడతాయి.
ఈ యాన్యుటీ ప్లాన్లు రెండు వేరియంట్లలో లభిస్తాయి. ఇమిడియేట్ యాన్యుటీ, డిఫాల్డ్ యాన్యుటీ. ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని పాలసీదారుడు ఎంచుకోవాలి. ఇమిడియేట్ యాన్యుటీ ప్లాన్‌ను ఎంచుకున్న పాలసీదారుడు వన్ టైమ్ ప్రీమియంను చెల్లించిన వెంటనే క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. అదే డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్‌ను ఎంచుకుంటే కొంతకాలం వేచి ఉన్న తర్వాత ఆదాయం పొందే వీలు కలుగుతుంది.
ATM Transaction Failed: ఏటీఎంలో డబ్బులు రాలేదా? అకౌంట్లో బ్యాలెన్స్ కట్ అయితే ఇలా కంప్లైంట్ చేయండి
SBI Scheme: ఎస్బీఐ ఈ స్కీమ్‌లో చేరడానికి జూన్ 30 చివరి తేదీ
ఈ రిటైర్మెంట్ ప్లాన్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీవితకాల ఖచ్చితమైన యాన్యుటీ ప్రయోజనాలు లభిస్తాయి. ఒకసారి ప్రీమియంను చెల్లించి, జీవిత కాలం కచ్చితమైన క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. కొనుగోలు చేసిన నాటి నుండి యాన్యుటీ తీసుకోవచ్చు. లేదంటే ఏడాది నుంచి పదేళ్ల వరకు ఈ యాన్యుటీని వాయిదా వేసుకోవచ్చు. నెలవారీగా, మూడు నెలలు, ఆరు నెలకు, సంవత్సరానికి ఒకసారి ఇలా పెన్షన్ తీసుకునే ఆప్షన్ కూడా దీని ద్వారా లభిస్తుంది. పాలసీదారుడు సింగిల్ లేదా జాయింట్ లైఫ్ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. సింగిల్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకు క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. అదే జాయింట్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీదారుడు మరణించినా సరే జీవిత భాగస్వామికి ఆదాయం వస్తుంది. మొత్తం 11 రకాల యాన్యుటీ ప్లాన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మన ఆర్థిక అవసరాలకు తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Icici, Icici bank, Pension Scheme, Personal Finance