ICICI Prudential-GIFT: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి కొత్త ప్లాన్.. బీమాతో పాటు ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

గోల్ బేస్డ్ సేవింగ్స్ ప్రొడక్ట్‌ విభాగంలో 'ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ఫర్ టుమారో' (GIFT) ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించింది. దీని ద్వారా పాలసీదారులు నిర్ణీత ఆదాయాన్ని క్రమం తప్పకుండా పొందవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఈ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉపయోగపడనుంది

  • Share this:
మన దేశంలో వివిధ వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కొన్ని ప్లాన్లు కుటుంభానికి ఆర్థిక భద్రత కల్పిస్తాయి. మరికొన్ని ఇన్సూరెన్స్‌తో పాటు గ్యారెంటీడ్ ఇన్‌కమ్‌కు భరోసా ఇస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త ప్లాన్ ఒకటి ప్రజలను ఆకర్షిస్తోంది. ఆ సంస్థ తాజాగా గోల్ బేస్డ్ సేవింగ్స్ ప్రొడక్ట్‌ విభాగంలో 'ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ఫర్ టుమారో' (GIFT) ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించింది. దీని ద్వారా పాలసీదారులు నిర్ణీత ఆదాయాన్ని క్రమం తప్పకుండా పొందవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఈ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉపయోగపడనుంది. ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్ సేవింగ్స్ ప్రొడక్ట్. భవిష్యత్తులో రానున్న ఆదాయంపై నెలకొనే అనవసర భయాలను ఇది దూరం చేస్తుంది.

ఈ కొత్త ప్లాన్ పాలసీదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ హామీతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో GIFT వంటి ఇన్సూరెన్స్ ప్లాన్లు తప్పనిసరిగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ గోల్ బేస్డ్‌ ఇన్సూరెన్స్ స్కీమ్ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాలసీదారులు వీటిపై అవగాహన పెంచుకోవాలి.

ఆదాయం
ఈ ప్లాన్‌లో పాలసీదారుడు నిర్ణీత ఆదాయం పొందే మెచూరిటీ పీరియడ్‌ను ఎంచుకోవచ్చు. 5, 7, 10 ఏళ్ల పాటు గ్యారెంటీడ్ ఇన్‌కమ్ రూపంలో మెచ్యూరిటీ బెనిఫిట్ పొందవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ప్రీమియం చెల్లించాలనుకునేవారికి, సాధారణ పాలసీదారుల దీర్ఘకాలిక అవసరాలకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో 5, 7, 10 సంవత్సరాలకు (PPT) ఒకసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీంతోపాటు 5, 7, 10 సంవత్సరాల వరకు గ్యారెంటీడ్ ఇన్‌కమ్ అందుకునే ఆప్షన్‌ను కూడా ఎంచుకోవాలి. దీంట్లో పాలసీ టెన్యూర్ PPT+1గా ఉంటుంది. పాలసీ అమల్లో ఉన్న మొత్తం కాలానికి లైఫ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ముందస్తు ఆదాయం
ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నవారు ప్రీమియం చెల్లించిన రెండవ సంవత్సరం నుంచే ఆదాయాన్ని అందుకోవచ్చు. దీన్ని గ్యారెంటీడ్ ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్ అంటారు. పాలసీ టర్మ్ ముగిసిన తరువాత పొందే ఆదాయాన్ని గ్యారెంటీడ్ ఇన్‌కమ్ అంటారు. ప్రీమియం చెల్లించిన రెండవ సంవత్సరం నుంచి పాలసీ టర్మ్ ముగిసే వరకు అందుకునే ఆదాయాన్ని గ్యారెంటీడ్ ఎర్లీ ఇన్‌కమ్ అంటారు. కస్టమర్లు రెగ్యులర్‌గా ఆదాయాన్ని పొందడానికి పాలసీ మెచూరిటీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో కస్టమర్లు సేవింగ్స్ పెంచుకుంటూనే, రెగ్యులర్ ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ ప్లాన్ ఆప్షన్‌లో 7 లేదా 10 సంవత్సరాలకు (PPT) ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించిన రెండవ సంవత్సరం నుంచి రెగ్యులర్‌గా ఆదాయాన్ని పొందుతారు. పాలసీ టెన్యూర్ PPT+1గా ఉంటుంది. పాలసీ అమల్లో ఉన్న మొత్తం కాలానికి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది.

ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించడం
ఈ వేరియెంట్‌లో వినియోగదారులు పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఒక్కసారి మాత్రమే ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ టెన్యూర్ ముగిసిన తరువాత ఒకేసారి ఏకమొత్తంలో గ్యారెంటీడ్ బెనిఫిట్ అందుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు గ్యారెంటీడ్ రిటర్న్స్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ను పొందవచ్చు. ఈ GIFT ప్లాన్‌లో 'సేవ్ ద డేట్' అనే మరో ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా పెళ్లి రోజు, భాగస్వామి పుట్టిన రోజు వంటి ప్రత్యేకమైన తేదీల నుంచి ఆదాయం పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published: