దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు తీసుకువచ్చిన FASTag ను ప్రజలు తప్పనిసరిగా వినియోగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు సులభంగా సేవలందించేందుకు వివిధ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. తాజాగా FASTag కోసం ఐసిఐసిఐ బ్యాంక్ గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లు గూగుల్‌పే ద్వారా FASTag ను ఆర్డర్ చేయడం, దాని ట్రాకింగ్, రీఛార్జ్ వంటివన్నీ చేసుకోవచ్చు. FASTag కోసం డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాంతో ఒప్పందం చేసుకున్న మొదటి బ్యాంకుగా ఐసిఐసిఐ నిలిచింది. గూగుల్ పే సాయంతో FASTag డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ముంబైలోని టోల్ ప్లాజాలు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ జోన్ టోల్‌ప్లాజాలతో అవగాహన కుదుర్చుకున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధి సుదీప్తా రాయ్ తెలిపారు.
వినియోగదారులకు ఉపయోగం
ఈ ఒప్పందంతో FASTag వ్యవస్థలో మరో ఘనతను సాధించినట్టు భావిస్తున్నామని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ సర్వీస్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, ఎక్కువమంది వినియోగదారులకు FASTag ను అందించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని ఐసీఐసీఐ, గూగుల్ పే సంస్థలు చెబుతున్నాయి. గూగుల్ పేలో UPI ద్వారా FASTag ను సులభంగా, సౌకర్యవంతంగా రీఛార్జ్ చేయడం ద్వారా వినియోగదారులు లబ్ధి పొందవచ్చని NPCI సిఒఒ ప్రవీణ రాయ్ చెప్పారు.
Google Pay నుంచి ఫాస్‌ట్యాగ్‌ను ఎలా పొందాలంటే..
వినియోగదారులు గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి ‘బిజినెస్’ విభాగాన్ని ఎంచుకోవాలి. అక్కడ కనిపించే ‘ఐసిఐసిఐ బ్యాంక్ FASTag ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ‘Buy new FASTag’ ను ఎంచుకొని పాన్ నంబర్, ఆర్సి, వేకిల్ నంబర్, అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత OTP ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను వెరిఫికేషన్ చేయాలి. పేమెంట్ చేసిన తరువాత FASTag ఆర్డర్ అవుతుంది.
Published by:Krishna Adithya
First published:December 29, 2020, 11:10 IST