Mutual Fund SIP | చాలా మంది పోస్టాఫీస్ స్కీమ్స్ లేదంటే బ్యాంక్ (Banks) పథకాల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీటిల్లో రిస్క్ ఉండదు. అందుకే చాలా మంది వీటి వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు దాచుకునే వారు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే వీటిల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ ఒకే రకమైన రాబడిని అందించలేవు. కొన్ని భారీ లాభాలు అందిస్తే.. మరికొన్ని మోసాలు లాభాలు లేదంటే నష్టాలను కూడా అందించి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇన్వెస్టర్ల పంట పండించిన మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం.
రూ.30 లక్షలు అందించే అద్భుతమైన పాలసీ.. నెలకు రూ.500 నుంచి కట్టొచ్చు, ఒక్క ప్లాన్‌తో 3 లాభాలు!
అదే ఐసీఐసీఐ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ మార్కెట్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ స్కీమ్ ఏయూఎం రూ. 14,227 కోట్లు. మల్టీ అసెట్ కేటగిరిలో దాదాపు 68 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఫండ్‌లో 2002 అక్టోబర్ నెలలో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా రూ. 4.6 కోట్లకు చేరి ఉండేది. అంటే ఫండ్ సీఏజీఆర్ 21 శాతంగా ఉంది. అదే ఈ మ్యూచువల్ ఫండ్ సిప్ పనితీరు విషయానికి వస్తే.. నెలకు రూ.10 వేలు సిప్ చేస్తూ వచ్చి ఉంటే.. ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 24 లక్షలు అయ్యేది. అయితే ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా రూ. 1.8 కోట్లకు చేరి ఉండేది.
సర్ప్రైజ్ ఆఫర్.. 200MP కెమెరా ఫోన్‌పై ఏకంగా రూ.35 వేల డిస్కౌంట్!
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ అనేది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఈకవ్టీ, డెట్, ఎక్స్చేజ్ ట్రేడెడ్ కమొడిటీ డెరివేటివ్స్ వంటి వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, రిట్స్, ఇన్విట్స్ వంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడిని అందించాలనే లక్ష్యంతో ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ఆధారపడి ఉంటాయి.
ఈ ఫండ్ తన ఇన్వెస్ట్మెంట్ డబ్బుల్లో 10 నుంచి 80 శాతం వరకు స్టాక్స్‌లో పెడుతుంది. ఈక్విటీ, గోల్డ్, డెట్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడమే ఈ ఫండ్ అడ్వాంటేజ్ అని కంపెనీ పేర్కొంటోంది. ఏ టైమ్‌లో ఏ అసెట్ క్లాస్ మంచి పనితీరు కనబరుస్తుందనే అంచనాలు ఉండాలని, అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ, సీఐవో ఎస్ నరేన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Icici, Investments, Money, Mutual Funds, SIP