ICICI Home Loan: ఒక్క రోజులో రూ.1 కోటి హోమ్ లోన్... ఇలా అప్లై చేయండి

ICICI Instant Home Loan offer | ప్రీ-అఫ్రూవ్డ్ లోన్ ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. అంత లోపే లోన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు.

news18-telugu
Updated: April 5, 2019, 12:16 PM IST
ICICI Home Loan: ఒక్క రోజులో రూ.1 కోటి హోమ్ లోన్... ఇలా అప్లై చేయండి
ICICI Home Loan: ఒక్క రోజులో రూ.1 కోటి హోమ్ లోన్... ఇలా అప్లై చేయండి
  • Share this:
భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్‌లో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ తన కస్టమర్లకు 'ఇన్‌స్టంట్ హోమ్ లోన్' ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం తన కస్టమర్లకు క్రెడిట్ స్కోర్ ఆధారంగా రూ.1 కోటి వరకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. సాలరీడ్ కస్టమర్లకు ఆన్‌లైన్‌లోనే ఒక్కరోజులోనే లోన్ మంజూరు చేయడం ఈ ఆఫర్ ప్రత్యేకత. మార్చి 27న ఈ ఆఫర్ మొదలైంది. క్రెడిట్ స్కోర్‌ను డేటా ఆల్గరిథమ్స్‌తో విశ్లేషించి ప్రీ-అప్రూవ్డ్‌ లోన్స్‌ కోసం కస్టమర్లను ఎంపిక చేయనుంది ఐసీఐసీఐ. క్రెడిట్ బ్యూరోలు ఇచ్చే సమాచారం, నెలనెలా అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే జీతం, యావరేజ్ బ్యాలెన్స్, రీపేమెంట్ ట్రాక్ లాంటివి ఆల్గరిథమ్ సాయంతో విశ్లేషిస్తోంది ఐసీఐసీఐ. కస్టమర్ల ఫైనాన్షియల్ హిస్టరీని బట్టి రూ.1 కోటి వరకు ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ చేస్తోంది.



ఇప్పటికే తమ దగ్గర హోమ్‌లోన్ తీసుకున్నవారికి రూ.20 లక్షల వరకు 10 ఏళ్ల కాలానికి టాప్-అప్ లోన్ కూడా ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేట్లల్లో ఎలాంటి మార్పు ఉండదు. మామూలుగా అయితే హోమ్ లోన్ ప్రాసెస్ పూర్తి కావడానికి ఏడెనిమిది రోజుల సమయం పడుతుంది. కానీ... కొత్త ఆఫర్‌లో జస్ట్ కొన్ని క్లిక్స్‌తో హోమ్ లోన్ పొందొచ్చు. ఒకవేళ ప్రాపర్టీ ఎంచుకోలేనివారి కోసం సుమారు 30,000 పైగా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఐసీఐసీఐ దగ్గర ఉన్నాయి. వాటిలోంచి ఏదైనా ఎంచుకోవచ్చు. ప్రీ-అఫ్రూవ్డ్ లోన్ ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. అంత లోపే లోన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. త్వరలో ఈ సర్వీస్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో మొదలుకానుంది.

Read this: EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు వరం... కొత్త పీఎఫ్ ఇలా లెక్కించాలి

ICICI Home Loan: ప్రీ-అప్రూవ్డ్ లోన్‌కు ఇలా దరఖాస్తు చేసుకోవాలి


మీరు కొత్తగా హోమ్‌లోన్ తీసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.
ఐసీఐసీఐ రీటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్‌లో లాగిన్ చేసి My accounts క్లిక్ చేయండి.
Loans సెక్షన్‌లో ఇన్‌స్టంట్ హోమ్‌లోన్ సాంక్షన్‌పైన క్లిక్ చేయండి.
మీకు లోన్ ఎంత కావాలో, టెన్యూర్ ఎంతో ఎంటర్ చేయండి.
ప్రాసెసింగ్ ఫీజు వివరాలు కనిపిస్తాయి.
మీరు యాక్సెప్ట్‌ చేస్తే సాంక్షన్ లెటర్ మీ ఇ-మెయిల్ ఐడీకి వస్తుంది.
సాంక్షన్ లెటర్‌తో పాటు మీరు కొనాలనుకుంటున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంకుకు వెళ్లాలి.
ఈ లింక్ క్లిక్ చేసి ఇన్‌స్టంట్ హోమ్‌లోన్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

టాప్ అప్ హోమ్‌లోన్ తీసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.
ఐసీఐసీఐ రీటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్‌లో లాగిన్ చేయండి.
exclusive offerings సెక్షన్‌లో view offer on apply online పైన క్లిక్ చేయండి.
మీకు లోన్ ఎంత కావాలో, టెన్యూర్ ఎంతో ఎంటర్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Disburse now క్లిక్ చేస్తే డబ్బులు వెంటనే మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.
ఈ లింక్ క్లిక్ చేసి టాప్ అప్ హోమ్‌లోన్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

ఇవి కూడా చదవండి:

Whatsapp tipline: వాట్సప్‌లో 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్... ఫేక్ న్యూస్‌కు ఇలా చెక్ పెట్టండి

Link PAN: మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ఇలా లింక్ చేయండి

PF Withdrawl: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
Published by: Santhosh Kumar S
First published: April 5, 2019, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading