Home /News /business /

ICICI DIRECT LAUNCHES APP TO TEACH FINANCE INVESTMENT TO INDIANS UMG GH

iLearn App: ఐసీఐసీఐ డైరెక్ట్ ఐలెర్న్ యాప్‌ లాంచ్.. ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ పాఠాలు చెప్పనున్న ప్లాట్‌ఫామ్

iLearn App: ఐసీఐసీఐ డైరెక్ట్ ఐలెర్న్ యాప్‌ లాంచ్.. ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ పాఠాలు చెప్పనున్న ప్లాట్‌ఫామ్

iLearn App: ఐసీఐసీఐ డైరెక్ట్ ఐలెర్న్ యాప్‌ లాంచ్.. ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ పాఠాలు చెప్పనున్న ప్లాట్‌ఫామ్

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ‘ఐసీఐసీఐ డైరెక్ట్ ఐలెర్న్’ పేరుతో ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ఇది ఒక లెర్నింగ్ యాప్. వివిధ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, మార్కెట్ అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను నేర్చుకోవడానికి వినియోగదారులకు సులభమైన యాక్సెస్‌ను ఇది అ

ఇంకా చదవండి ...
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ‘ఐసీఐసీఐ డైరెక్ట్ ఐలెర్న్’ పేరుతో ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ఇది ఒక లెర్నింగ్ యాప్. వివిధ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, మార్కెట్ అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను నేర్చుకోవడానికి వినియోగదారులకు సులభమైన యాక్సెస్‌ను ఇది అందిస్తుంది. కస్టమర్‌లకు వారి పెట్టుబడి మార్గంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి, అవసరమైన నాలెడ్జ్‌ను కూడా అందించనుంది.

కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు, ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారి అవసరాలను తీర్చడం కోసం ప్రామాణిక, సమకాలీన కంటెంట్ చేర్చి, ఆర్థిక లేదా పెట్టుబడి సాధనాలపై వారికి అవగాహన కల్పించడం ‘ICICIdirect iLearn’ లక్ష్యం. ఈ యాప్ ప్రస్తుతం వివిధ విభాగాలలో 550 కంటే ఎక్కువ కంటెంట్ టాపిక్స్‌ను హోస్ట్ చేస్తుంది. ప్రస్తుత మార్కెట్ పరిణామాలతో సహా విభిన్న అంశాలపై కంటెంట్ రెగ్యులర్‌గా ఇందులో అప్‌డేట్ అవుతుంది.

ఆర్థిక విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఉదాహరణలు ఉపయోగపడతాయి. పైగా వినియోగదారుల ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని మెరుగుపరుస్తాయి. ఇన్వెస్టర్లు తమ నగదును పెట్టుబడి పెట్టడంపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ సిస్టమ్‌లో కూడా అందుబాటులో ఉంది.

భారత్ వంటి దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు క్రమంగా మార్కెట్‌లలో పెట్టుబడుల వైపు మళ్లుతున్నారని, అయితే వారిలో అధిక శాతం మందికి ఆర్థిక లేదా పెట్టుబడి సాధనాల గురించి ఇంకా తెలియదని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. ఇలాంటి వారికి కొత్త యాప్ ఉపయోగపడుతుందని వెల్లడించింది.

ఐసీఐసీఐ డైరెక్ట్ రిటైల్ ఈక్విటీ హెడ్ విశాల్ గులేచా మాట్లాడుతూ.. ‘ఫిజికల్ ఫార్మాట్‌లో ఐసీఐసీఐ డైరెక్ట్ గత దశాబ్ధకాలం నుంచి వివిధ అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. తద్వారా భారతీయ పెట్టుబడిదారులకు ఆర్థిక పరిజ్ఞానాన్ని అందజేస్తోంది. ప్రస్తుతం ప్రపంచం డిజిటలైజేషన్ వైపు కదులుతోంది. ఆర్థిక విషయాలపై నిపుణులు పరిశోధించి, సరళీకృతం చేసిన కంటెంట్‌ను పెట్టుబడిదారులకు అందించడానికి ఉద్దేశించిన ఐసీఐసీఐడైరెక్ట్ ఐలెర్న్(ICICIdirect iLearn)ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. అలాగే పెట్టుబడిదారులకు తాజా సమాచారం అందించడం కోసం యాప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది.’ అని పేర్కొన్నారు.

త్వరలో ఈ ప్లాట్‌ఫారమ్‌లో ‘ఐకమ్యూనిటీ’(iCommunity) ని ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు విశాల్ తెలిపారు. తోటి పెట్టుబడిదారుల ద్వారా నేర్చుకునే అవకాశాన్ని ఐకమ్యూనిటీ కల్పిస్తుందన్నారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు, వారికి ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు తాము నిరంతర ప్రయత్నిస్తుంటామన్నారు. ఐసీఐసీఐడైరెక్ట్ ఐలెర్న్(ICICIdirect iLearn) పెట్టుబడిదారుల ప్రణాళికలను బలోపేతం చేయడంతోపాటు వారు కోరుకున్న లక్ష్యాలను సాధించగలదని తాము బలంగా నమ్ముతున్నట్లు విశాల్ చెప్పుకొచ్చారు.

కాగా, గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికాన్ని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లాభాలతో ముగించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 340 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 329 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం వృద్ధి చెంది రూ. 892 కోట్లకు చేరింది. క్లయింట్‌ బేస్‌ 6.2 లక్షలు పెరిగి 76 లక్షలకు చేరింది.
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు