హోమ్ /వార్తలు /బిజినెస్ /

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. రేపు ఒక్క రోజే ఛాన్స్.. ఎల్లుండి నుంచి ఈ సేవలు బంద్!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. రేపు ఒక్క రోజే ఛాన్స్.. ఎల్లుండి నుంచి ఈ సేవలు బంద్!

 ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. రేపు ఒక్క రోజే ఛాన్స్.. ఎల్లుండి నుంచి ఈ సేవలు బంద్!

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. రేపు ఒక్క రోజే ఛాన్స్.. ఎల్లుండి నుంచి ఈ సేవలు బంద్!

Deposits | ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. బ్యాంక్ అందిస్తున్న స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు రేపటితో ముగియనుంది. అంటే ఎల్లుండి నుంచి స్పెషల్ స్కీమ్ అందుబాటులో ఉండవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    ICICI FD Rates | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్ (Bank) అందిస్తున్న స్పెషల్ స్కీమ్ గడువు నేటితో ముగియనుంది. అంటే ఎల్లుండి నుంచి బ్యాంక్ అందిస్తున్న స్పెషల్ సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) స్కీమ్ అందుబాటులో ఉండదు. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. పథకంలో చేరాలని భావించే వారు ఇప్పుడే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

    ఐసీఐసీఐ బ్యాంక్ స్పెషల్ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు అక్టోబర్ 7తో ముగుస్తుంది. అందువల్ల కస్టమర్లు నేడు లేదా రేపటి లోగా ఈ పథకంలో చేరితే 0.10 శాతం అదనపు వడ్డీ ప్రయోజనం పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ పేరుతో ప్రత్యేక పథకాన్ని అందిస్తోంది. దేశంలోని సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

    ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వరకు.. బ్యాంకుల వాట్సాప్ బ్యాంకింగ్ సేవల నెంబర్లు ఇవే

    సీనియర్ సిటిజన్స్‌కు సాధారణంగానే బ్యాంకులు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీని అందిస్తున్నాయి. ఈ స్పెషల్ స్కీమ్‌లో చేరితే ఈ 0.5 శాతం వడ్డీని అదనంగా 0.1 శాతం వడ్డీ వస్తుంది. కొత్తగా ఓపెన్ చేసే ఎఫ్‌డీలకు లేదంటే రెన్యూవల్ చేసుకునే ఎఫ్‌డీలకు ఈ కొత్త వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే 5 ఏళ్ల 1 రోజు నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలకు ఈ వడ్డీ రేటు లభిస్తుంది.

    ఈ స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఎగబడి కొనేస్తున్న జనం.. నిమిషానికొకటి ఫట్!

    కాగా ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే మాత్రం 1.1 శాతం పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాగా సెప్టెంబర్ 30 నుంచి చూస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 6.6 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 7 రోజుల నుంచి 10 రోజుల పదేళ్ల వరకు కాల పరిమితితో డబ్బులు ఎఫ్‌డీ చేయొచ్చు. మూడేళ్ల 1 రోజు నుంచి ఐదేళ్లు, ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. కాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి కూడా కస్టమర్లకు ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. ఇటీవలనే ఈ బ్యాంకులు వీటి గడువును పొడిగించాయి. ఈ స్కీమ్స్ వచ్చే ఏడాది మార్చి చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Banks, FD rates, Fixed deposits, Icici bank, Money

    ఉత్తమ కథలు