హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibagger: ఐసీఐసీఐ బ్యాంక్‌లో డబ్బులు పెట్టిన వారికి కాసుల వర్షం.. సుడి తిరిగింది!

Multibagger: ఐసీఐసీఐ బ్యాంక్‌లో డబ్బులు పెట్టిన వారికి కాసుల వర్షం.. సుడి తిరిగింది!

 ఐసీఐసీఐ బ్యాంక్‌లో డబ్బులు పెట్టిన వారికి కాసుల వర్షం.. సుడి తిరిగింది!

ఐసీఐసీఐ బ్యాంక్‌లో డబ్బులు పెట్టిన వారికి కాసుల వర్షం.. సుడి తిరిగింది!

Bank News | చందా కొచ్చర్ ఉదంతం తర్వాత ఒక కుదుపుకు లోనైన ఐసీఐసీఐ బ్యాంక్ మళ్లీ గాడిలో పడింది. పరుగులు పెడుతూ వస్తోంది. బలమైన పనితీరును నమోదు చేస్తూ ఔరా అనిపిస్తోంది. బ్రోకరేజ్ సంస్థలు చాలా వరకు ఈ బ్యాంక్ షేరుపై బుల్లిష్‌గానే ఉన్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  ICICI Bank Stock | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) షేరు దుమ్మురేపుతోంది. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ధర తొలిసారిగా రూ. 900 మార్క్ పైకి చేరింది. నిధుల సమీకరణ అంశంపై బ్యాంక్ (Bank) స్పష్టత ఇవ్వడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో బ్యాంక్ షేర్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలు లభించాయని చెప్పుకోవచ్చు.

  ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌ఫ్రా బాండ్ల ద్వారా రూ. 10 వేల కోట్లు సమీకరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజీలు ఈ అంశంపై బ్యాంక్ నుంచి స్పష్టతను కోరాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ స్పందించింది. సాధారణ వ్యాపార కార్యకలాపాల కోసం నిధుల సమీకరణ నిర్ణయం తీసుకుంటాని వెల్లడించింది. బోర్డు అప్రూవల్ లభించాల్సి ఉందని తెలిపింది. బ్యాంక్ రెండు రోజులు ముందే ఎక్స్చేంజీలకు ఈ విషయాన్ని తెలియజేయనుంది. అంటే డేట్ ఆఫ్ అలాట్‌మెంట్ వంటి వివరాలు కూడా ఎక్స్కేంజీలకు చేరవేయనుంది.

  కస్టమర్లకు గ్రేట్ గిఫ్ట్ అందించిన బ్యాంక్.. సెప్టెంబర్ 13 నుంచి బంపర్ బెనిఫిట్స్

  బ్యాంక్ షేరు ధర ప్రస్తుతం రూ. 901 వద్ద ఉంది. ఇంట్రాడేలో షేరు ధర రూ. 911 స్థాయికి కూడా ఎగసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 6 లక్షల కోట్లకు పైకి చేరింది. ఐసీఐసీఐ స్టాక్ ధర ఆరు నెలల కాలంలోనే దాదాపు 35 శాతం మేర పరుగులు పెట్టింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు.

  ఇది జాతిరత్నమే.. 39 పైసలే కానీ రూ.కోట్లలో ప్రాఫిట్

  ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుతమైన పనితీరును కనరుస్తోందని, కొత్త మేనేజ్‌మెంట్ అమేజింగ్ అని ఇండిట్రేడ్ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్ బందోపాధ్యాయ్ తెలిపారు. చందా కొచ్చర్ ఉదంతం వల్ల ఇన్వెస్టర్లు చాలా ఆందోళనకు గురి అయ్యారని, అయితే తర్వాత వచ్చిన మేనేజ్‌మెంట్ బ్యాంక్‌ను గడ్డు పరిస్థితుల నుంచి పైకి తెచ్చిందని, మళ్లీ సరైన దిశలో నడిచిందని వివరించారు. గత త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు ఔట్ స్టాండింగ్ అని కొనియాడారు. కాగా బ్రోకరేజ్ సంస్థలు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర రూ. 1000 నుంచి రూ. 1225కు చేరొచ్చని అంచనా వేస్తున్నాయి. ఈ స్టాక్‌ను కవర్ చేసే 39 మంది అనలిస్ట్‌లలో 34 మంది షేరును కొనమని బలంగా సూచిస్తున్నారు. అలాగే మిగిలిన ఐదు మంది కూడా ఈ స్టాక్‌కు బై రేటింగ్ ఇచ్చారు. అంటే ఈ స్టాక్‌పై అందరూ ఎంత బుల్లిష్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Icici, Icici bank, Multibagger stock, Share Market Update, Stock Market

  ఉత్తమ కథలు