ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది ప్రైవేట్ రంగ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank). రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల లోపు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను(Interest Rates) తాజాగా సవరించినట్లు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్లో(Website) పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లు 2022 ఆగస్టు 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీతో అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50% నుంచి 5.90% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. తాజా వడ్డీ రేట్లను పరిశీలిద్దాం.
7 రోజుల నుంచి 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు 3.50% వడ్డీ రేటును అందిస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు 3.60% వడ్డీ రేటును అందిస్తుంది. 46 రోజుల నుంచి 60 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాజా వడ్డీ రేటు 4.00 శాతంగా ఉంది. 61 రోజుల నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై ఇప్పుడు 4.75% వడ్డీ రేటు వర్తిస్తుంది.
91 రోజుల నుంచి 184 రోజుల వరకు మెచ్యూరిటీ ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ICICI బ్యాంక్ 5.25% వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే 185 రోజుల నుంచి 270 రోజుల మెచ్యూరిటీ ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.40% వడ్డీ రేటును అందిస్తోంది. 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ICICI బ్యాంక్ ఇప్పుడు 5.60% వడ్డీ రేటును అందిస్తుంది. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు 6.05% వడ్డీ రేటు ఇస్తుంది. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాజా వడ్డీ రేటు 5.90 శాతంగా ఉంది.
WhatsApp: ఈ నెలాఖరులోగా వాట్సాప్‌లో ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఫీచర్ లాంచ్.. దీన్నెలా వాడాలంటే..?
‘ఇప్పుడు మీరు సౌలభ్యం ప్రకారం డిజిటల్, బ్రాంచ్ ఛానెల్ ద్వారా ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ICICI బ్యాంక్ FD ద్వారా అధిక FD వడ్డీ రేట్లతో మీ పొదుపులను పెంచుకోవచ్చు’ అని ICICI బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొంది
“ప్రస్తుత అనిశ్చితి, అత్యంత అస్థిరమైన మార్కెట్ పరిస్థితుల్లో మీరు ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హామీతో కూడిన రాబడిని పొందే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆధారపడవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ అనేది మార్కెట్లోని అత్యంత సురక్షితమైన AAA రేటింగ్ పొందిన ఎఫ్‌డీ” అని ICICI బ్యాంక్ వెబ్‌సైట్‌లో తెలిపింది.
రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ICICI బ్యాంక్ ఇంతకు ముందు ఆగస్టు 19న కూడా పెంచింది. ఒక సంవత్సరం నుంచి పదేళ్ల వరకు మెచ్యూరిటీలతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. ఫలితంగా 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ICICI బ్యాంక్ అందించే అత్యధిక వడ్డీ రేటు నాన్-సీనియర్ రెసిడెంట్‌లకు 6.10%, సీనియర్ సిటిజన్‌లకు 6.60% వరకు పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Bank rates, Icici, Icici bank atm, Icici lombard, Interest rates