• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • ICICI BANK REVISES FIXED DEPOSIT INTEREST RATES HERE FULL DETAILS NS GH

ICICI Bank: ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన ఐసిఐసిఐ బ్యాంక్​.. కొత్త వడ్డీ రేట్ల వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఐసిఐసిఐ బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్ ​డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల గడువు ఉండే ఎఫ్‌డిలపై కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తీసుకొచ్చింది ఐసిఐసిఐ. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ ​డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల గడువు ఉండే ఎఫ్‌డిలపై కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తీసుకొచ్చింది. మెచూరిటీ ఆధారంగా డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేటుపై ఖాతాదారులు అవగాహన పెంచుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్ 7 రోజుల నుంచి 29 రోజుల మెచ్యూరిటీపై 2.5% వడ్డీ రేటు, 30 రోజుల నుంచి 90 రోజుల మెచ్యూరిటీపై 3.5 % వడ్డీ అందించనుంది.185 రోజుల నుంచి ఏడాది కాలపరిమితి వరకు 4.4% వడ్డీ రేటు లభించనుంది. ఇక, ఏడాది నుంచి 18 నెలల వరకు 4.9% వడ్డీ, 18 నెలల నుండి రెండేళ్ల లోపు మెచ్యూరిటీ తీరే డిపాజిట్లపై 5% వడ్డీని అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 2 ఏళ్ల 1 రోజు నుండి 3 ఏళ్ల మధ్య గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 5.15% వడ్డీ, 3 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్ల వ్యవధి గల దీర్ఘకాలిక డిపాజిట్లపై 5.35% వడ్డీ రేటును పొందవచ్చు. ఇక, 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ గల డిపాజిట్లపై 5.50% వడ్డీ లభించనుంది.

సీనియర్ సిటిజన్లకు ఇలా..
సీనియర్​ సిటిజన్ల ఎఫ్​డీ విషయంలో ఐసీఐసీఐ కాస్త ఎక్కువ వడ్డీ రేట్లనే అందిస్తుంది. 7 రోజుల నుంచి ఒక నెల రోజుల మెచ్యూరిటీ గల ఎఫ్​డీలపై 3% వడ్డీ లభిస్తుంది. నెల రోజుల నుంచి మూడు నెలల మెచ్యూరిటీ గల ఎఫ్​డీలపై ఐసిఐసిఐ బ్యాంక్ 3.5% వడ్డీని అందిస్తుంది. 91 రోజుల నుంచి 184 రోజుల మధ్య గల ఎఫ్‌డిలపై 4% వడ్డీ, 185 రోజుల నుంచి ఏడాది మధ్య గల ఎఫ్​డీలపై 4.9% వడ్డీ రేట్లను లభించనుంది. ఇక, ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు గల ఎఫ్​డీలపై 5.4%, ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు ఎఫ్‌డిలపై 5.5% వడ్డీ రేటును లభించనుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య గల ఎఫ్​డీలు లేదా టర్మ్ డిపాజిట్లపై 5.65% వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది.

మూడేళ్ల నుంచి ఐదేళ్లలో మెచ్యూరిటీ తీరనున్న ఎఫ్‌డిలకు 5.85% వడ్డీ రేటు లభిస్తుంది. తాజా సరవరణతో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య గల ఫిక్స్​ డిపాజిట్లపై 6.3% వడ్డీని పొందవచ్చు. అయితే సీనియర్​ సిటిజన్ల విషయంలో ఈ తాజా వడ్డీరేట్లు టర్మ్​ డిపాజిట్లపై మాత్రమే వర్తిస్తాయని ఐసీఐసీఐ స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల వరకు చేసిన డిపాజిట్లపై ఈ తాజా వడ్డీ రేట్లు లభిస్తాయి. ఐసిఐసిఐ బ్యాంక్ సిబ్బంది (రిటైర్డ్ సిబ్బందితో సహా) అదనంగా 1% వడ్డీ రేటును పొందుతారు. మరో ప్రైవేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కూడా మే 6 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
Published by:Nikhil Kumar S
First published: