Fixed Deposits | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. బల్క్ ఎఫ్‌డీ రేట్లు (FD) పైకి కదిలాయి. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఎఫ్‌డీ రేట్ల పెంపు జనవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. కొత్తగా డబ్బులు దాచుకునే వారికి, లేదంటే పాత ఎఫ్‌డీలను రెన్యూవల్ చేసుకునే వారికి ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని గుర్తించుకోవాలి.
ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు మొత్తంలోని డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. 7 రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.5 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉంది. బ్యాంక్ 15 నెలల నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.15 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
ఎస్‌బీఐ అదిరిపోయే స్కీమ్.. చౌక వడ్డీకే రూ.10 లక్షల రుణం, కొంత కాలమే ఈ ఆఫర్!
7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. 30 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే 5.25 శాతం వడ్డీ లభిస్తోంది. 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై 5.5 శాతం వడ్డీ రేటు ఉంది. 61 నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. 91 రోజుల నుంచి 184 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. 185 రోజుల నుంచి 270 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా కొనసాగుతోంది.
రైతులకు కేంద్రం కొత్త ఏడాది కానుక! అకౌంట్లలోకి డబ్బులు? ఎప్పుడంటే..
271 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.65 శాతంగా కొనసాగుతోంది. ఏడాది నుంచి 15 నెలల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 7.1 శాతం వడ్డీ ఉంది. 15 నెలల నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.15 శాతంగా కొనసాగుతోంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై 7 శాతం, మూడేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను డిసెంబర్ నెలలో పెంచిన విషయం తెలిసిందే. గరిష్టంగా 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇది వర్తిస్తుంది. అదే రెగ్యులర్ కస్టమర్లకు అయితే 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Icici, Icici bank, Personal Finance