ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... వడ్డీ రేట్లు మారాయి

ICICI Bank FD interest rates | ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మార్చింది. లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: September 9, 2020, 11:19 AM IST
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... వడ్డీ రేట్లు మారాయి
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... వడ్డీ రేట్లు మారాయి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఐసీఐసీఐ బ్యాంకు కస్టమరా? ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉందా? వడ్డీ కోసం డబ్బులు దాచుకున్నారా? అయితే అలర్ట్. ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మార్చింది. కొన్ని టెన్యూర్‌లో మాత్రమే వడ్డీ రేట్లను మార్చింది. 50 బేసిస్ పాయింట్స్ వడ్డీని తగ్గించింది. 91 రోజుల నుంచి 184 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఐసీఐసీఐ బ్యాంకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది. వడ్డీ రేట్లను సవరించడంతో 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీకి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. 30 రోజుల నుంచి 90 రోజులకు 3 శాతం, 91 రోజుల నుంచి 184 రోజుల ఎఫ్‌డీకి 3.5 శాతం, 185 రోజుల నుంచి 289 రోజుల ఎఫ్‌డీకి 4.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 290 రోజుల నుంచి ఏడాది ఎఫ్‌డీపై 10 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గింది. ఇప్పుడు 4.40 శాతం మాత్రమే లభిస్తుంది. ఏడాది నుంచి 18 నెలల ఎఫ్‌డీకి 5 శాతం, 18 నెలల నుంచి 2 ఏళ్ల ఎఫ్‌డీకి 5.10 శాతం, 2 ఏళ్ల 1 రోజు నుంచి మూడేళ్లకు 5.15 శాతం వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. మారిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 7 నుంచే అమలులోకి వచ్చాయి.

EPFO KYC: ఈపీఎఫ్ అకౌంట్‌లో తప్పులున్నాయా? ఆన్‌లైన్‌లో సరిచేయండిలా

PAN card: పాన్ కార్డ్ విషయంలో ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్

ICICI Bank FD interest rates: ఐసీఐసీఐ బ్యాంక్ లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే...


7 రోజుల నుంచి 14 రోజులు - 2.50%
15 రోజుల నుంచి 29 రోజులు - 2.50%
30 రోజుల నుంచి 45 రోజులు - 3%46 రోజుల నుంచి 60 రోజులు - 3%
61 రోజుల నుంచి 90 రోజులు- 3%
91 రోజుల నుంచి 120 రోజులు - 3.5%
121 రోజుల నుంచి 184 రోజులు - 3.5%
185 రోజుల నుంచి 210 రోజులు- 4.40%
211 రోజుల నుంచి 270 days - 4.40%
271 రోజుల నుంచి 289 రోజులు - 4.40%
290 రోజుల నుంచి ఏడాదిలోపు - 4.40%
1 ఏడాది నుంచి 389 రోజులు - 5%
390 రోజుల నుంచి 18 నెలకు- 5%
18 నెలల నుంచి 2 ఏళ్లు- 5.1%
2 ఏళ్ల 1 రోజు నుంచి 3 ఏళ్లు- 5.15%
3 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్లు- 5.35%
5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్లు - 5.50%

సీనియర్ సిటిజన్లకు పైన వివరించిన వడ్డీ కన్నా 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా వడ్డీ వస్తుంది. 50 బేసిస్ పాయింట్స్ అంటే అరశాతం. 100 బేసిస్ పాయింట్స్ అంటే 1 శాతంతో సమానం. సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 3 శాతం నుంచి 6.3 శాతం వడ్డీ లభిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: September 9, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading