ICICI BANK REVISED FIXED DEPOST INTEREST RATES CHECK LATEST RATES HERE BA GH
ICICI FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి గుడ్ న్యూస్.. ICICI వడ్డీ రేట్లు పెంచింది చూడండి..
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త... వడ్డీ రేట్ల పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)
ICICI Bank Latest interest rates | ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ICICI బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఈ బ్యాంకు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు బ్యాంక్ తాజా అప్డేట్లో తెలిపింది.
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ICICI బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఈ బ్యాంకు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు బ్యాంక్ తాజా అప్డేట్లో తెలిపింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాల వ్యవధికి చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఐసీఐసీఐ మార్చింది. సీనియర్ సిటిజన్లకు కూడా ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. కొత్త FD వడ్డీ రేట్లు ఏప్రిల్ 28, గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లకు మాత్రమే సీనియర్ సిటిజన్ రేట్లు వర్తిస్తాయని కూడా బ్యాంకు స్పష్టం చేసింది. గతంలో ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఐసీఐసీఐ ఎఫ్డీ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.30 శాతంగా ఉంది. దీన్ని తాజాగా 5 బేసిస్ పాయింట్లు పెంచి 4.35 శాతానికి పరిమితం చేసింది. ఇతర కాలవ్యవధికి కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. అయితే ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై ICICI బ్యాంక్ FD వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి.
2022 ఏప్రిల్ 28 నుంచి ICICI బ్యాంక్లో రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇవే..
7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.50 శాతం
15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.50 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.75 శాతం
46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.75 శాతం
61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం
91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.35 శాతం
121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.35 శాతం
151 రోజుల నుంచి 184 రోజులు: సాధారణ ప్రజలకు - 3.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.35 శాతం
185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.60 శాతం
211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 3.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.60 శాతం
271 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు - 3.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.80 శాతం
290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 3.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.80 శాతం
1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు - 4.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.35 శాతం
390 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.35 శాతం
15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.45 శాతం
18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.60 శాతం
2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.70 శాతం
3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.80 శాతం
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.80 శాతం
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.