ICICI Bank Golden Years FD| ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. అలాగే మరికొంత మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ (Bank) ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌పై వడ్డీ రేటును తగ్గించేసింది. 10 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పథకంపై వడ్డీ రేటులో కోత విధించింది. దీంతో ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. గతంలో కన్నా ఇప్పుడు తక్కువ వడ్డీ లభిస్తుంది.
అలర్ట్.. బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విరమణ!
సీనియర్ సిటిజన్స్‌కు ఇకపై అదనంగా 0.10 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్‌కు లభించే 0.5 శాతం అదనపు వడ్డీకి ఇది మళ్లీ అదనం. ఐదేళ్లు లేదా అంత కన్నా ఎక్కువ టెన్యూర్ (10 ఏళ్ల వరకు) కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇది వర్తిస్తుంది. ఇదివరకు అదనపు వడ్డీ రేటు అనేది 0.2 శాతంగా ఉండేది. ఇకపోతే ఈ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ 2023 ఏప్రిల్ 7 వరకు అందుబాటులో ఉండనుంది.
బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఎక్కడైనా ఒకే రేటు!
ఇకపోతే ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్‌లో ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. అయితే చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. డబ్బులు టెన్యూర్ కన్నా ముందే విత్‌డ్రా చేసుకుంటే 1.1 శాతం వరకు పెనాల్టీ పడుతుంది.
అలాగే మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. రూ. 2 కోట్లకు లోపు ఎఫ్డీలపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్ల వరకు పైకి చేరింది. ఇప్పటికే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. ప్రస్తుతం బ్యాంక్ 3 శాతం నుంచి 6.6 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌కు ఈ రేటు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.1 శాతం వరకు వడ్డీ వస్తుంది. కాగా కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులు కూడా ఇటీవల కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేశాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో కూడా రెపో రేటు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Icici bank, Personal Finance