Investment | చేతిలో డబ్బులు బ్యాంక్‌లో దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలో (Fixed Deposit) డబ్బులు దాచుకోవచ్చు. ఒకేసారి డబ్బులు పెట్టాలి. పదేళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంపిక చేసుకొని డబ్బులు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి మీ డబ్బుతో (Money) పాటు వడ్డీని పొందొచ్చు. ఒకేసారి కాకుండా ప్రతి నెలా కొంత మొత్తం దాచుకోవాలని భావిస్తే మాత్రం రికరింగ్ డిపాజిట్లను ఎంచుకుంటే సరిపోతుంది.
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కస్టమర్లకు రికరింగ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తోంది. క్రమం తప్పకుండా క్రమశిక్షణతో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి రికరింగ్ డిపాజిట్లు అనువుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ముందే టెన్యూర్ ఎంచుకోవాలి. ఆ టెన్యూర్ అయిపోయేంత వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి.
మారనున్న బ్యాంకుల పనివేళలు.. ఇకపై ముందుగానే తెరచుకోనున్న బ్రాంచులు!
ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీరు 6 నెలల నుంచి 120 నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకొని డబ్బులు పెడుతూ వెళ్లాలి. నెలకు కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఆర్డీ అకౌంట్లపై వచ్చే వడ్డీ మొత్తంపై ట్యాక్స్ పడుతుంది. టీడీఎస్ కట్ అవుతుంది. సాధారణ ఆర్డీల కన్నా సీనియర్ సిటిజన్స్ ఆర్డీలకు అధిక వడ్డీ వస్తుంది.
బ్యాంక్‌కు వెళ్లకుండానే 20కి పైగా సర్వీసులు పొందండి.. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లతో లాభాలెన్నో!
సాధారణ కస్టమర్లకు ఆర్డీ అకౌంట్‌పై 4.25 శాతం నుంచి 6.1 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ ఆర్డీ అకౌంట్‌పై అయితే 4.75 శాతం నుంచి 6.6 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు మీరు నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే.. 6.6 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీకు పదేళ్ల తర్వాత చేతికి రూ. 8.5 లక్షల వరకు వస్తాయి. ఇందులో మీరు పెట్టిన మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. వడ్డీ రూపంలో దాదాపు రూ.2.5 లక్షలు వస్తాయి. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారికి ఇది అనువుగా ఉంటుంది. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేని వారు కూడా ఈ ఆర్డీ స్కీమ్‌ను ఒకసారి పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకా ఇతర బ్యాంకులు కూడా ఈ సేవలు అందిస్తున్నాయి. అందువల్ల అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Fixed deposits, Icici bank, Personal Finance, Recurring Deposits