ICICI BANK PAYLATER SERVICE OFFERS RS 25000 CREDIT LIMIT WITHOUT INTEREST UP TO 45 DAYS SS
ICICI: వడ్డీ లేకుండా అప్పు... ఐసీఐసీఐ నుంచి ఆఫర్
(ప్రతీకాత్మక చిత్రం)
ICICI Bank PayLater Service | పేలేటర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆన్లైన్లో షాపింగ్ చేసినా, మార్కెట్లోని స్టోర్లల్లో వస్తువులు కొన్నా యూపీఐ ఐడీ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
మీరు ఏదైనా స్మార్ట్‌ఫోన్ కొనాలా? లేదా ఇంట్లోకి టీవీ, ఫ్రిజ్ లాంటివి తీసుకోవాలా? సమయానికి చేతిలో డబ్బులు లేవని ఆలోచిస్తున్నారా? మీకు ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలు... వడ్డీ లేకుండా కొంత కాలానికి అప్పు తీసుకోవచ్చు. వడ్డీ చెల్లించకుండా తిరిగి అసలు చెల్లిస్తే చాలు. ఐసీఐసీఐ పేలేటర్ ఆప్షన్ ఇది. వడ్డీ లేని లోన్ తీసుకోవాలంటే మీరు బ్యాంకు నియమనిబంధనలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం పేలేటర్ ఆప్షన్ ద్వారా వడ్డీ లేకుండా రుణం పొందొచ్చు. ఇది క్రెడిట్ కార్డులాగా పనిచేస్తుంది. మీకు కేటాయించిన లిమిట్‌ను వాడుకొని తర్వాత డబ్బులు చెల్లిస్తే చాలు. మీరు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి 45 రోజుల గడువు ఉంటుంది. ఈ సదుపాయం వాడుకోవడానికి పేలేటర్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
image: ICICI
ICICI PayLater account: ఐసీఐసీఐ పేలేటర్ అకౌంట్ ఇలా క్రియేట్ చేసుకోండి
ముందుగా ఐసీఐసీఐ మొబైల్ యాప్‌లో పేలేటర్ అకౌంట్ పాప్ అప్ పైన Activate Now క్లిక్ చేయండి.
నియమనిబంధనలన్నీ చదువుకొని టిక్ చేసి Got it పైన క్లిక్ చేయండి.
మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ నెంబర్, డెబిట్ అకౌంట్ చెక్ చేసుకొని Submit పైన క్లిక్ చేయాలి.
ఆటో-పేమెంట్ కోసం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
వర్చువల్ పేమెంట్ అడ్రస్-VPA క్రియేట్ చేయాలి.
ఆ తర్వాత మీ పేలేటర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
పేలేటర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే పాకెట్స్ డ్యాష్‌బోర్డ్‌లో వివరాలు కనిపిస్తాయి.
పేలేటర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆన్లైన్లో షాపింగ్ చేసినా, మార్కెట్లోని స్టోర్లల్లో వస్తువులు కొన్నా యూపీఐ ఐడీ ద్వారా పేమెంట్ చేయొచ్చు. యువతను దృష్టిలో పెట్టుకొని ఐసీఐసీఐ 'పేలేటర్' సర్వీస్ అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ లేనివారికి ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. పేలేటర్ ద్వారా రూ.25,000 వరకు క్రెడిట్ లిమిట్ అందిస్తోంది ఐసీఐసీఐ. 45 రోజుల పేమెంట్ చేస్తే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్మీ 7ఏ... ఎలా ఉందో చూడండి