• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • ICICI BANK OFFERS EASY QUICK AND HASSLE FREE DIGITAL WAYS THROUGH WHICH YOU CAN GET ICICI BANK FASTAG HERE FULL DETAILS NS

FASTag Online: ఫాస్టాగ్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ ఐదు సింపుల్ మార్గాలను అనుసరించడండి

ప్రతీకాత్మక చిత్రం

ఫాస్టాగ్ గురించి సరైన అవగాహన లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఎలా అప్లై చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. కింద అందించిన ఈ సూచనలు ఫాలో అవ్వడం ద్వారా ICICI Bank FASTagను సులువుగా పొందొచ్చు.

  • Share this:
    కారు లేదా మరేదైనా ఫోర్ వీలర్ వాహనాన్ని కలిగి ఉన్న వారికి ఫాస్టాగ్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సేపు వేచి ఉండడం, రద్దీని తొలగించడం, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఫాస్టాగ్ విదానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. బార్ కోడ్ లాంటి ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అని అంటారు. ఇక ఈ ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజులు వసూలు చేయనున్నారు. దీంతో ఫోర్ వీలర్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఫాస్టాగ్ తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే ఫాస్టాగ్ గురించి సరైన అవగాహన లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఎలా అప్లై చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. వారి కోసం ఈ వివరాలు..

    Fastag తో లాభాలు..
    -ఆన్లైన్ లో రీచార్జ్ చేసుకోవచ్చు
    -నగదును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
    -ఆన్లైన్ లో మంత్లీ పాస్ ను తీసుకునే అవకాశం.
    -ఆన్లైన్, మొబైల్ యాప్ ల ద్వారా ఫాస్టాగ్ ను కొనుగోలు చేయొచ్చు.

    ICICI Bank FASTag portal:
    అయితే మనం బ్యాంక్ కస్టమర్ కాకపోయినా ICICI బ్యాంకు మనకు సులభంగా, త్వరగా ఫాస్టాగ్ ను పొందే అవకాశాన్ని అందిస్తోంది. ఇది ఎలా అంటే..
    -ముందుగా మనం ICICI Bank FASTag portal ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం ‘New Customer – Apply Now’పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం ఫాస్టాగ్ అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
    -కావాల్సిన వివరాలను నమోదు చేసిన అనంతరం పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
    -పేమెంట్ పూర్తయిన అనంతరం మీ ఆర్డర్ ప్రాసెస్ చేయబడుతుంది.
    -అనంతరం ఫాస్టాగ్ మన చిరునామాకు పంపబడుతుంది.

    Google Pay:
    -మొదట మనం గూగుల్ పేను ఓపెన్ చేయాలి. అనంతరం బిజినెస్ విభాగంలో ‘ICICI Bank FASTag’పై క్లిక్ చేయాలి.
    -అనంతరం ‘Buy new FASTag’పై క్లిక్ చేయాలి.
    -అనంతరం మన పాన్ కార్డు వివరాలు, ఆర్సీ కాపీ, వాహన నంబరు, చిరునామాను నమోదు చేయాలి.
    -ఓటీపీ ద్వారా మన మొబైల్ నంబరును వెరిఫై చేయాల్సి ఉంటుంది. అనంతరం పేమెంట్ చేయాలి.
    -పేమెంట్ పూర్తయిన అనంతరం ఫాస్టాగ్ మన ఇంటికి వస్తుంది.

    iMobile Pay app:
    ఈ యాప్ ద్వారా కూడా మనం ఫాస్టాగ్ ను పొందొచ్చు.
    -మొదట మనం iMobile App ను గూగుల్ ప్లే స్టోర్ లేదా Apple Store నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -అనంతరం ఆ యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
    -అనంతరం ‘Shop’పై క్లిక్ చేయాలి. అనంతరం ‘FASTag’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం ‘Buy New’ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ వాహన వివరాలను నమోదు చేయాలి.
    -అనంతరం వాహన వివరాలను కన్ఫామ్ చేయాలి. పేమెంట్ అనంతరం మన ఆర్డర్ ప్రసెస్ చేయబడుతుంది. తర్వాత ఫాస్టాగ్ మన చిరునామకు పంపబడుతుంది.

    ICICI Bank internet banking:
    -మొదట మీ ఐసీఐసీఐ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకిగ్ అకౌంట్ లో లాగిన్ అవ్వాలి.
    -అనంతరం ‘Payments & Transfer’ పై క్లిక్ చేయాలి, తర్వాత ‘Buy/Recharge FASTag’ పై క్లిక్ చేయాలి.
    -తర్వాత కావాల్సిన వివరాలను నమోదు చేయాలి. తర్వాత పేమెంట్ చేయాలి.
    -పేమెంట్ పూర్తయిన అనంతరం మీ ఫాస్టాగ్ మీ చిరునామాకు చేరవేయబడుతుంది.

    WhatsApp:
    -వాట్సాప్ ద్వారా సైతం మీరు ఫాస్టాగ్ ను కొనుగోలు చేయవచ్చు.
    -వాట్సాప్ లో 8640086400 నంబరుకు Hi అని మెసేజ్ చేయాలి.
    -అనంతరం మూడో ఆప్షన్ ‘ICICI Bank FASTag services’పై క్లిక్ చేయాలి.
    -అనంతరం మళ్లీ మూడో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ‘Apply for a new tag’పై క్లిక్ చేయాలి.
    -అనంతరం ఐసీఐసీఐ ఫాస్టాగ్ అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
    -అక్కడ కావాల్సిన వివరాలు నమోదు చేయాలి.
    -పేమెంట్ పూర్తయిన తర్వాత ఆర్డర్ ప్రాసెస్ అవుతుంది. ఫాస్టాగ్ మన చిరునామాకు చేరవేయబడుతుంది.
    Published by:Nikhil Kumar S
    First published: