news18-telugu
Updated: November 11, 2020, 5:14 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పండుగ సీజన్లో, ICICI బ్యాంక్ రిటైల్ దుకాణదారులకు మంచి ఆఫర్ ను ముందుకు తెచ్చిదిం. ఇందులో భాగంగా వారి వ్యాపారం వృద్ధి చెందడానికి, ICICI బ్యాంక్ డిజిటల్ స్టోర్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ (డిఎస్ఎంపి) ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద రిటైల్ దుకాణదారుల కోసం. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా, కిరాణా దుకాణాలు బిల్లింగ్ నుండి చెల్లింపు వరకు POS, క్యూఆర్‌కోడ్, చెల్లింపు లింకుల ద్వారా నిర్వహించవచ్చు. అంటే ICICI బ్యాంక్ అందిస్తున్న ఈ ప్లాట్ ఫాం ద్వారా, దుకాణదారులు తమ కిరాణా దుకాణాన్ని పూర్తి స్థాయి ఆన్లైన్ స్టోర్‌గా మార్చవచ్చు. ఇలా చేయడం ద్వారా, వారు ఆన్లైన్ ఆర్డర్లను కూడా పొందే వీలుంది. ఈజీపే యాప్ ద్వారా POS మెషీన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏదైనా దుకాణదారుడు డిజిటల్ స్టోర్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
యాప్ కోసం దరఖాస్తు చేయండి .
డిజిటల్ ప్లాట్ఫామ్లో మూడు అప్లికేషన్లు ఉన్నాయి. వీటిలో, eazystore mobile app దుకాణదారుడు తన దుకాణాన్ని ఆన్లైన్ స్టోర్‌గా 30 నిమిషాల్లో మార్చుకోవడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో, eazybilling app ద్వారా యుపిఐ లేదా డెబిట్-క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన చెల్లింపులకు అనుమతిని ఇస్తుంది. అలాగే వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తుంది.. దుకాణదారులు ఈ యాప్ ద్వారా జాబితా మరియు ఆర్డర్లను కూడా నిర్వహించవచ్చు. eazybilling యాప్ లో, అమ్మకాలు, లాభం, జీఎస్టీతో పాటు, అనేక రకాల నివేదికలను రూపొందించడానికి కూడా ఒక ఎంపిక ఉంటుంది.
పంపిణీదారులు కూడా ఆర్డర్లు పంపగలుగుతారు
eazysupply app ద్వారా, దుకాణదారుడు తన హోల్‌సేల్ లేదా పంపిణీదారుడు ఆన్లైన్ ఆర్డర్లను పొందవచ్చు. ఇది దుకాణదారుడి సమయాన్ని ఆదా చేస్తుంది. అదనంగా, చిన్న దుకాణదారులకు సరఫరా దారు నుండి వివిధ ప్రమోషన్లు, డిస్కౌంట్ల ప్రయోజనం కూడా లభిస్తుంది. బ్యాంకు స్వయం ఉపాధి విభాగం అధిపతి పంకజ్ గాడ్గిల్ దీనిపై మరిన్ని వివరాలు తెలుపుతూ...ఈ యాప్ ద్వారా దుకాణదారులకు కొత్త కస్టమర్లను చేరుకోవడం సులభం అవుతుంది.
కోటిమంది కిరాణా దుకాణా దారులే లక్ష్యంగా ఆన్లైన్ స్టోర్లు...
కరోనా వైరస్ సంక్షోభ సమయాల్లో, వినియోగదారులు రోజువారీ అవసరాలను కొనడానికి కాంటాక్ట్‌లెస్, సులభమైన మరియు డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారని పంకజ్ గాడ్గిల్ తెలిపారు. ఈ కొత్త ప్లాట్‌ఫాం సహాయంతో, దుకాణదారులు తమ కిరాణా దుకాణాన్నిడిజిటల్ చెల్లింపుల దుకాణంగా మార్చగలుగుతారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా 1 కోటి కిరాణా దుకాణాలను ఆన్లైన్ స్టోర్లుగా మార్చాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
Published by:
Krishna Adithya
First published:
November 11, 2020, 5:14 PM IST