Home /News /business /

ICICI BANK MONSOON BONANZA GET UP TO RS 7500 DISCOUNT ON SMARTPHONES WITH ICICI BANK CREDIT CARDS AND DEBIT CARDS SS

ICICI Monsoon Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్లపై రూ.7,500 వరకు డిస్కౌంట్

ICICI Monsoon Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్లపై రూ.7,500 వరకు డిస్కౌంట్
(ప్రతీకాత్మక చిత్రం)

ICICI Monsoon Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్లపై రూ.7,500 వరకు డిస్కౌంట్ (ప్రతీకాత్మక చిత్రం)

ICICI Monsoon Bonanza | స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుతో (ICICI Bank) స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.7,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు మాన్‌సూన్ బొనాంజా (ICICI Bank Monsoon Bonanza) ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్స్, ట్రావెల్, గ్రాసరీ, ఆటోమొబైల్, ఫర్నీచర్ లాంటి ప్రొడక్ట్స్ కొనేవారికి భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కస్టమర్లు తమ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ICICI Bank Credit Card) లేదా డెబిట్ కార్డుతో లావాదేవీలు చేస్తే చాలు. ఆఫర్స్ పొందొచ్చు. ఐసీఐసీఐ కార్డులతో స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.7,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటే ఎలాంటి ఆఫర్ లభిస్తుందో తెలుసుకోండి.

iPhone: లేటెస్ట్ యాపిల్ ఫోన్ అయిన ఐఫోన్ 13 కొనేవారికి రూ.2,341 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తుంది. 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

OnePlus: వన్‌ప్లస్ నుంచి వచ్చిన అన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొంటే మోడల్‌ను బట్టి రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 2022 జూలై 31 వరకు ఆఫర్స్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐలకు ఈ ఆఫర్ లభిస్తుంది.

Smartphone Sale: రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్


Oppo: ఒప్పో స్మార్ట్‌ఫోన్ కొనేవారికి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. గరిష్టంగా రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.12,000 కొనుగోలు చేయాలి. 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Vivo: వివో ఎక్స్, వీ, వై, టీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కొంటే రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 2022 జూలై 31 వరకు ఆఫర్స్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐలకు ఈ ఆఫర్ లభిస్తుంది.

Xiaomi: షావోమీ స్మార్ట్‌ఫోన్స్ కొనేవారికి రూ.7,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 2022 జూలై 31 వరకు ఆఫర్స్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Flipkart Offer: స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ... ఆఫర్ ధర రూ.14,999

Realme: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొంటే 7 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. కనీసం రూ.7,499 ట్రాన్సాక్షన్ చేయాలి. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొంటే 10 శాతం గరిష్టంగా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం రూ.10,000 ట్రాన్సాక్షన్ చేయాలి. 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.



iQoo: ఐకూ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం రూ.13,999 కొనుగోలు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Icici bank, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు