Home /News /business /

ICICI BANK LINKS UPI ID FACILITY TO ITS POCKETS DIGITAL WALLET HERE FULL DETAILS NS GH

ICICI: ఐసీఐసీఐ సూపర్ ఫీచర్​.. వాలెట్ ద్వారా యూపీఐ చెల్లింపులు.. పూర్తి వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ తమ డిజిటల్ వాలెట్​ ‘పాకెట్స్​’ యాప్​ వాడే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వాలెట్​లో ఉండే డబ్బులతో డైరెక్ట్ గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలివే..

ఐసీఐసీఐ బ్యాంకు ఓ కొత్త విధానంతో ముందుకు వచ్చింది. తమ డిజిటల్ వాలెట్​ ‘పాకెట్స్​’ యాప్​ వాడే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వాలెట్​లో ఉండే డబ్బుతో నేరుగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చని చెప్పింది. కొత్త కస్టమర్లు సైతం సేవింగ్ అకౌంట్ వివరాలు సమర్పించకుండానే యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటికే వాలెట్ వాడుతున్న కస్టమర్లు కొత్త ఐడీ పొందుతారని వెల్లడించింది. వాలెట్ ద్వారానే యూపీఐ చెల్లింపులకు అవకాశం రావడంతో.. ప్రతీసారి బ్యాంకు ఖాతాను సెలెక్ట్ చేసుకుని పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న మొత్తాల చెల్లింపులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తక్కువ డబ్బు చెల్లించినా.. ఆ లావాదేవీ కూడా కూడా బ్యాంకు ట్రాన్సక్షన్​లో నమోదు కాకుండా.. ఎంట్రీ తక్కువగా ఉంటుంది. ఒక్కసారి వాలెట్​లో డబ్బు యాడ్ చేసుకుంటే వాలెట్ ద్వారానే చెల్లింపులు చేయవచ్చు. ఇలా వాలెట్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ సదుపాయం తీసుకొచ్చిన తొలి బ్యాంకు ఐసీఐసీఐ.
Big Bazaar Offer: బిగ్ బజార్ సూపర్ ఆఫర్.. కేవలం రూ.500తో రూ. 1500 విలువైన షాపింగ్ చేసే ఛాన్స్.. ఆఫర్ మరో నాలుగు రోజులే..


బ్యాంకు ఖాతా లేని స్కూలు, కాలేజీ విద్యార్థులకు సైతం ఇలా వాలెట్ నుంచి యూపీఐ చెల్లింపులు చేసే ఫీచర్ చాలా ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ చెప్పింది. వేరే పాకెట్స్​ యూజర్​ పంపే డబ్బు వాలెట్ చేరితే.. అక్కడి నుంచి వారు బ్యాంకు ఖాతా అవసరం లేకుండా వాలెట్​ నుంచే చెల్లింపులు చేయవచ్చని వివరించింది. “వేగంగా, సులభంగా వినియోగదారులు లావాదేవీలు చేసుకునేందుకు మేం (ఐసీఐసీఐ) కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలను తీసుకొస్తున్నాం.


ఐదేళ్ల క్రితం ‘పాకెట్స్​’ను లాంచ్ చేశాం. ఫోన్ ద్వారా తక్షణమే ట్రాన్సాక్షన్లు చేసుకునేలా డిజిటల్ వాలెట్​ను తీసుకొచ్చాం. అయితే వాలెట్​కు యూపీఐ ఐడీ యాడ్ చేయాలని మా పరిశోధకులు సూచించారు. దీనిద్వారా చిన్న మొత్తాలను చెల్లించేందుకు కూడా బ్యాంకు అకౌంట్​కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వాలెట్​ నుంచి చెల్లించేలా సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎన్​పీసీఐతో కలిసి పనిచేసి.. ఈ ప్రత్యేకమైన ఫీచర్​ను తీసుకొచ్చాం. పాకెట్స్​ వాలెట్ వాడుతున్న కస్టమర్లకు ఇది ఎంతో సురక్షితమైన, సులువైన పద్ధతిగా ఇది ఉండనుంది’ అని బ్యాంకు ప్రకటించింది.


ఎలా వాడాలంటే..

కొత్త యూజర్లు ముందుగా ప్లేస్టోర్​లో ఐసీఐసీఐ పాకెట్స్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని లాగిన్ కావాలి. లాగిన్ అయ్యాక ఆటోమేటిక్​గా వీపీఏ క్రియేట్ అవుతుంది. ఫోన్ నంబర్​తోనే ఇది ఉంటుంది. ఫోన్ నంబర్ తర్వాత @pockets అని ఉంటుంది. దీని ద్వారా నేరుగా చెల్లింపులు చేసుకోవచ్చు. యూపీఐ ఐడీ కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్​గా జనరేట్ అయిన యూపీఐ ఐడీని కావాలంటే మార్చుకునే అవకాశం ఉంది. పాకెట్స్ యాప్ ద్వారా కస్టమర్లు క్యూర్ కోడ్​లను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. అలాగే డబ్బును చెల్లించవచ్చు, స్వీకరించవచ్చు. అలాగే మర్చెంట్ సైట్స్​లో యూపీఐ పేమెంట్స్​తో పాటు కాంటాక్ట్​లకు డబ్బు ట్రాన్స్​ఫర్ చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: BHIM UPI, Icici bank, UPI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు