Home /News /business /

ICICI BANK LAUNCHES INSTABIZ MOBILE APP FOR MSMES OFFERS OVERDRAFT FACILITY OF UP TO RS 25 LAKH SS

ICICI InstaBIZ: ఐసీఐసీఐ కొత్త యాప్‌లో వ్యాపారులకు గొప్ప అవకాశం... రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం

ICICI InstaBIZ: ఐసీఐసీఐ కొత్త యాప్‌లో వ్యాపారులకు గొప్ప అవకాశం... రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం
(ప్రతీకాత్మక చిత్రం)

ICICI InstaBIZ: ఐసీఐసీఐ కొత్త యాప్‌లో వ్యాపారులకు గొప్ప అవకాశం... రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం (ప్రతీకాత్మక చిత్రం)

ICICI InstaBIZ App | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వ్యాపార రుణాలు (Business Loans), రూ.25 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టాబిజ్ యాప్ లాంఛ్ చేసింది.

    వ్యాపారులకు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) సేవల్ని అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్త డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇన్‌స్టాబిజ్ (InstaBIZ) పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా వ్యాపారులకు పలు రకాల సేవల్ని ఐసీఐసీఐ బ్యాంక్. తమ కస్టమర్లకు మాత్రమే కాదు, ఇతర బ్యాంకుల కస్టమర్లకు కూడా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం ఇవ్వనుంది. ప్రస్తుత కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని మెరుగుపర్చడం, ఎంఎస్ఎంఈలకు, ఇతర బ్యాంకు కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలన్నీ అందించడం, వ్యాల్యూ యాడెడ్ సేవల్ని కూడా అందించడం కోసం ఇన్‌స్టాబిజ్ యాప్ రూపొందించింది ఐసీఐసీఐ బ్యాంక్.

    ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఇన్‌స్టాబిజ్ యాప్ డౌన్‌లోడ్ చేసి ఓవర్‌డ్రాఫ్ట్ కోసం అప్లై చేయొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వెన్నెముక అని ఐసీఐసీఐ బ్యాంక్ నమ్ముతోందని, వారు వ్యాపారాన్ని మరింత సులభతరంగా చేసేలా ప్రయత్నించడం, వారి వృద్ధిలో తామూ భాగస్వాములం కావడమే తమ లక్ష్యమని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనూప్ బగ్చీ తెలిపారు.

    OnePlus: వన్‌ప్లస్ సంచలనం... తొలిసారి రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్


    ఇతర బ్యాంకుల కస్టమర్లుగా ఉన్న ఎంఎస్ఎంఈలు ఇన్‌స్టాబిజ్ యాప్‌లో గెస్ట్ లాగిన్ ద్వారా సేవల్ని పొందొచ్చు. వ్యాపారులు తమ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ సహా ఇతర వివరాలను ఎంటర్ చేస్తే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ ద్వారా అప్లికేషన్ ఫామ్ సిద్ధమవుతుంది. వీడియో కేవైసీ ద్వారా ఐసీఐసీఐ బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత ఇన్‌స్టాఓడీ ప్లస్ ఫీచర్ ద్వారా కేవలం కొన్ని క్లిక్స్‌తో రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం పొందొచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం ఇన్‌స్టంట్‌గా జరిగిపోతుంది. పేపర్ వర్క్ కూడా అవసరం లేదు.

    Samsung Galaxy M53 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ సేల్ ఈరోజే... భారీ డిస్కౌంట్ పొందండి ఇలా

    వ్యాపారులు ఇన్‌స్టాబిజ్ యాప్ ద్వారా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే యాప్‌లో అకౌంట్ బ్యాలెన్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఎఫ్‌డీ లాంటి వివరాలన్నీ చూడొచ్చు. ప్రీఅప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ద్వారా వ్యాపారులు తమ బిజినెస్ విస్తరించుకోవచ్చు. చెక్ బుక్ రిక్వెస్ట్‌తో పాటు చెక్ నిలిపివేయడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యం.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Business Loan, Icici bank, Msme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు