Loan: మ్యూచువల్ ఫండ్స్ ఉన్నవారికి రూ.1 కోటి వరకు ఐసీఐసీఐ బ్యాంకు లోన్

Loan: మ్యూచువల్ ఫండ్స్ ఉన్నవారికి రూ.1 కోటి వరకు ఐసీఐసీఐ బ్యాంకు లోన్ (ప్రతీకాత్మక చిత్రం)

ICICI Bank Insta Loans against Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్ తాకట్టు పెట్టుకొని లోన్స్ ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించింది ఐసీఐసీఐ బ్యాంకు.

  • Share this:
    మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా? ప్రతీ నెల సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-SIP ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవద్దని బ్యాంకులు సరికొత్త స్కీమ్స్ ప్రారంభిస్తున్నాయి. కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌తో కలిసి ఐసీఐసీఐ బ్యాంకు మ్యూచువల్ ఫండ్స్‌కు లోన్లు ఇచ్చే సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టైతే వాటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న కస్టమర్లు తమ హోల్డింగ్స్‌ను తాకట్టు పెడితే రూ.50,000 నుంచి రూ.1 కోటి వరకు లోన్ ఇస్తోంది ఐసీఐసీఐ బ్యాంకు. డిజిటల్ పద్ధతిలో ఈ లోన్ తీసుకోవచ్చు. బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు.

    Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? ఫ్రీగా తెలుసుకోండి ఇలా

    Savings Scheme: రూ.66 లక్షలు రిటర్న్ ఇచ్చే ఈ స్కీమ్ గురించి తెలుసా?


    సాధారణంగా ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఆ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయన్న నమ్మకం ఉంటే వాటిని రీడీమ్ చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించరు. కానీ అత్యవసరం డబ్బులు అవసరమైతే ఏం చేయాలో తోచదు. అలాంటివారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. తమ మ్యూచువల్ ఫండ్స్ రీడీమ్ చేసుకోకుండా వాటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇక ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు వీడియో కేవైసీ ద్వారా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ తీసుకునే సదుపాయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభ కాలంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇలా కొత్తకొత్త సదుపాయాలను ప్రారంభిస్తున్నాయి బ్యాంకులు.
    First published: