హోమ్ /వార్తలు /బిజినెస్ /

ICICI Bank: ఇక బ్యాంకుకు వెళ్లే పని లేదు... ఆన్‌లైన్‌లోనే ఐసీఐసీఐ హోమ్‌ లోన్స్‌

ICICI Bank: ఇక బ్యాంకుకు వెళ్లే పని లేదు... ఆన్‌లైన్‌లోనే ఐసీఐసీఐ హోమ్‌ లోన్స్‌

ICICI Bank: ఇక బ్యాంకుకు వెళ్లే పని లేదు... ఆన్‌లైన్‌లోనే ఐసీఐసీఐ హోమ్‌ లోన్స్‌
(ప్రతీకాత్మక చిత్రం)

ICICI Bank: ఇక బ్యాంకుకు వెళ్లే పని లేదు... ఆన్‌లైన్‌లోనే ఐసీఐసీఐ హోమ్‌ లోన్స్‌ (ప్రతీకాత్మక చిత్రం)

ICICI Bank | కస్టమర్లకు సులభంగా హోమ్ లోన్స్ (Home Loans) ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ ఐలెన్స్ ప్లాట్‌ఫామ్ లాంఛ్ చేసింది. ఇక బ్యాంకుకు వెళ్లే పని లేకుండా ఆన్‌లైన్‌లోనే హోమ్‌ లోన్స్‌ తీసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

గతంలో బ్యాంకులో లోన్‌ (Bank Loan) తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. బ్యాంకు సిబ్బంది అడిగే బోలెడు డాక్యుమెంట్లతో రోజూ బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు పర్సనల్‌ లోన్లు వంటివి ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే మంజూరవుతున్నాయి. తాజాగా హోమ్‌ లోన్‌ల (Home Loan) ప్రక్రియను కూడా సులభతం చేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త డిజిటల్ లెండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ iLens లాంచ్‌ చేసింది. ఈ తరహా సేవలు మొదటిసారి డిజిటల్‌ విధానంలో అందిస్తున్నట్లు తెలిపింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అభివృద్ధి చేసిన ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా రుణం తీసుకునే వారికి ప్రాసెస్‌ తేలిక కానుందని తెలిపింది.

iLens అంటే ఏంటి?

iLens అనేది డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌. ఐసీఐసీఐ బ్యాంకులో ఇంటి రుణం తీసుకోవాలని అనుకునేవారు నేరుగా దీని నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాసెస్‌తోపాటుగా క్రెడిట్‌ డిస్బర్స్‌మెంట్‌ వరకు మొత్తం రుణ ప్రక్రియ డిజిటల్‌గానే అయిపోతుంది. ప్రస్తుతం కేవలం ఇంటి రుణాల సేవలను మాత్రమే దీని ద్వారా అందించనున్నట్లు TCS ఒక ప్రకటనలో తెలిపింది. పేపర్‌లెస్ లాగిన్, డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌, ప్రాపర్టీ పరిశీలన, ఇన్‌స్టెంట్‌ సాంక్షన్, లోన్‌ డిస్బర్స్‌మెంట్‌లు తక్కువ సమయంలోనే జరుగుతాయని పేర్కొంది.

Savings Scheme: తక్కువ పొదుపుతో రూ.13 లక్షల పైనే రిటర్న్స్... స్కీమ్ వివరాలివే

ఎలా పని చేస్తుంది?

iLens బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో మొదటి ఇనిషియేటివ్‌ అని టీసీఎస్‌ తెలిపింది. తాము ఐసీఐసీఐ పాలసీలకు అనుగుణంగా దీన్ని తయారు చేశామంది. డేటా లీడ్‌ అల్గారిథమ్‌తో ఇది పని చేస్తుందని చెప్పింది. దీని ద్వారా క్రెడిట్‌ అసెస్‌మెంట్‌, ఆస్తికి సంబంధించిన అంచనాలు, లీగల్‌ టెక్నికల్‌ డాక్యుమెంటేషన్‌లు లాంటివి జరుగుతాయని చెప్పుకొచ్చింది. ఈ ఫీచర్‌ల ఆధారంగా బ్యాంకు కొత్త కస్టమర్‌లకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్‌లు కూడా అందుతాయని తెలిపింది.

కస్టమర్‌ ఒక్కరికే కాదు..!

iLens ఇంటర్‌పేస్‌ వినియోగదారులు ఒక్కరే వాడుకోవడానికి కాదు. వీరితోపాటు లోన్‌ మంజూరు చేయడంలో పని చేసే బ్యాంకు ఉద్యోగులు , సోర్సింగ్ ఛానెల్‌లు, లాయర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, అండర్‌రైటర్లు వంటి వారందరికీ ఇది ఒకటే ఏకీకృత డిజిటల్ ఇంటర్‌ఫేస్‌గా ఉంటుంది.

PAN Card: ఇద్దరు వ్యక్తులకు ఒకే పాన్‌ నెంబర్‌... కోర్టును ఆశ్రయించిన వ్యక్తి... ఏం జరిగిందంటే

లైవ్‌ స్టేటస్‌ చూడొచ్చు

ఈ ప్లాట్‌ఫారమ్‌లో మొదట వీడియో KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్‌ చేసే వివరాల ఆధారంగా లోన్‌ ఇచ్చే ముందు సంబంధిత వ్యక్తి క్రెడిట్ అసెస్‌మెంట్‌ కూడా చేస్తుంది. దీని ద్వారా లోన్‌ అప్లికేషన్‌ లైవ్‌ స్టేటస్‌ చూసుకోవచ్చు. అదనపు పేపర్‌ వర్క్‌లు, ఫీజు చెల్లింపులలాంటివీ డిజిటలైజ్‌ అవుతాయి.

ఈ విషయంపై ICICI బ్యాంక్ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ వి.వి.బాలాజీ మాట్లాడుతూ.. మేము రుణాలను 'iLens' ద్వారా ఇవ్వడం మొదటిసారిగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇది బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో అతిపెద్ద మార్పు అని, గణనీయమైన మార్పులను తీసుకొస్తుందని వివరించారు. ప్రస్తుతం ఇంటి రుణాల మంజూరు సేవలు మాత్రమే దీని నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. త్వరలో ఈ ఫ్లాట్‌ఫాం కిందకి మరిన్ని సేవలను తీసుకురావాలనే యోచనలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉందని, పర్సనల్‌, ఆటో లోన్లు, క్రెడిట్ కార్డ్‌లలాంటి వాటిని దీని కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

First published:

Tags: Bank loans, Home loans, Housing Loans, Icici bank, Personal Finance

ఉత్తమ కథలు