Home /News /business /

ICICI BANK LAUNCHES FESTIVE BONANZA CHECK LIST OF DISCOUNT AVAILABLE ON BRANDS LOAN OFFERS KMV

ICICI Festive Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ దుమ్మురేపే ఆఫర్లు.. రూ.25 వేల భారీ తగ్గింపు!

ICICI Festive Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ దుమ్మురేపే ఆఫర్లు.. రూ.25 వేల భారీ తగ్గింపు!

ICICI Festive Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ దుమ్మురేపే ఆఫర్లు.. రూ.25 వేల భారీ తగ్గింపు!

ICICI Bank Offers | ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లు తీసుకువచ్చింది. పండుగ ఫెస్టివల్ బొనాంజా ఆవిష్కరించింది. రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. దీని వల్ల కస్టమర్లకు పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    ICICI Offers | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు తీసుకువచ్చింది. ఫెస్టివ్ బొనాంజా తీసుకువచ్చింది. పండుగ సీజన్ (Festive Offers) సందర్భంగా కస్టమర్లు వివిధ రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు పొందొచ్చు. బ్యాంక్ క్రెడిట్ కార్డు (Credit Card), డెబిట్ కార్డులపై (Debit Card) రూ. 25 వేల తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్సూమర్ ఫైనాన్స్, కార్డ్‌లెస్ ఈఎంఐ వంటి వాటిపై కూడా ఆఫర్లు ఉంటాయని తెలిపింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఈఎంఐపై కూడా ఆఫర్లు పొందొచ్చని పేర్కొంది. కస్టమర్ల పండుగ సీజన్ అవసరాల నేపథ్యంలో బ్యాంక్ వారికి అనువైన ఆఫర్లు తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్స్ గూడ్స్, గ్యాడ్జెట్స్, గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు, జువెలరీ, గ్రాసరీ, ఆటోమొబైల్, ఫర్నీచర్, ట్రావెల్, డైనింగ్ వంటి వాటిపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ , మింత్రా, బిగ్ బాస్కెట్, బ్లింకింగ్, మేక్‌మైట్రిప్, ఐఫోన్ 14, శాంసంగ్, ఎజియో, రిలయన్స్ డిజిటల్, క్రోమా, ఎల్‌జీ, డెల్, స్విగ్గీ, జొమాటో, పీసీ జువెలర్స్ వంటి తదితర బ్రాండ్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్ ప్రొడక్టులపై స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్ , గోల్డ్ లోన్ వంటి వాటిపై కూడా ఆఫర్లు పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. 7 నెలల కనిష్టానికి కుప్పకూలిన బంగారం ధర.. కారణం ఇదే! నేటి రేట్లు ఇలా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్, ఎజియో లుక్సె వంటి ఈకామర్స్ సంస్థల వెబ్‌సైట్లలో 10 శాతం తగ్గింపు పొందొచ్చు. గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు అయిన అర్మానీ ఎక్స్చేంజ్, కెనలీ, క్లార్క్స్, డీజిల్, జియోర్జియో, హమ్లే, హుగో బాస్, జిమ్మీ చో, కటే స్పాడే, పాల్ అండ్ షార్క్, సత్య పాల్, స్టీవ్ మడెన్, బ్రూక్స్ అండ్ బ్రదర్స్ వంటి వాటిపై తగ్గింపు పొందొచ్చు. ఆధార్ కార్డుదారులకు కొత్త సేవలు.. ఇక మరింత భద్రంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు! ఎల్‌జీ, క్యారియర్, డెల్, యురేకా ఫోర్బ్స్, హయర్, సోనీ, వోల్టర్, వర్ల్‌పూల్ వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్లపై 10 శాతం వరకు తగ్గింపు ఉంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ అమ్మకాలపై కూడా ఆక్షణీయ డీల్స్ పొందొచ్చు. యాపిల్ ఐఫోన్ 14ను రూ. 2497 ఈఎంఐ ఆఫర్‌తో పొందొచ్చు. ఎంఐ, వన్‌ప్లస్ , ఒప్పొ, రియల్‌మి, వివో ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. పీసీ జువెలర్స్‌లో షాపింగ్ చేస్తే రూ.లక్ష కొనుగోలుపై రూ. 5 వేలు, రూ. 50 వేల షాపింగ్‌పై రూ. 2,500 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. జొమాటో, స్విగ్గీ, ఈజీడిన్నర్‌లో 20 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Banks, Icici bank, Latest offers, Money, Personal Loan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు