స్టార్టప్‌లకు బూస్ట్...ICICI Bank నుంచి సరికొత్త iStartup 2.0 ప్రోగ్రామ్...

స్టార్టప్ పెట్టాలనుకునే వారిని ఎంకరేజ్ చేస్తూ భారతదేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ రోజు ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త ఆఫర్ ఐస్టార్టప్ 2.0 ను విడుదల చేసింది.

news18-telugu
Updated: September 11, 2020, 8:34 AM IST
స్టార్టప్‌లకు బూస్ట్...ICICI Bank నుంచి సరికొత్త iStartup 2.0 ప్రోగ్రామ్...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టార్టప్ పెట్టాలనుకునే వారిని ఎంకరేజ్ చేస్తూ భారతదేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ రోజు ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త ఆఫర్ ఐస్టార్టప్ 2.0 ను విడుదల చేసింది. ఈ నూతన ప్రోగ్రాం ద్వారా ఐసీఐసీఐలో కరెంట్ అకౌంట్ తెరిచే కస్టమర్లకు ప్రస్తుతం మూడు వేరియంట్లలో అమల్లో ఉన్న ప్రమోటర్స్  ప్రీమియం సేవింగ్ అకౌంట్, ఉద్యోగులకు ఇచ్చే శాలరీ అకౌంట్లో ఉన్న అన్ని సదుపాలయాలు కల్పించబడుతాయి. ఈ పథకంలో భాగంగా బ్యాంకే స్వయంగా "అమ్మకందారుల లాంటి" సేవను అందింస్తుంది. దీని కొరకు విక్రేతలతో ఒప్పందం కుదుర్చుకుంది, దీనిలో స్టార్టప్‌లు కంపెనీ రిజిస్ట్రేషన్, టాక్సేషన్, కంప్లైయెన్స్, లాజిస్టిక్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, స్టాఫ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ వంటి వివిధ సేవలను యాక్సెస్ చేయవచ్చు.

ప్రస్తుత ఐసీఐసీఐలో ఖాతాను కలిగి ఉన్న వారు కూడా స్టార్టప్‌ల కోసం బ్యాంకును సంప్రదించవచ్చు. ఖాతాకు సంబంధించిన ఛార్జీల గురించి ఐసీఐసీఐ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెగ్మెంట్ హెడ్ పంకజ్ గాడ్గిల్ విలేకరులతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుత అమల్లో ఉన్న స్టార్టప్స్ విధానాలకు ఇది అధనం. అని అన్నారు.

అంతేకాక బిజినెస్ ఇతర అంశాలను జాగ్రత్తగా చూసుకోవటం మరియు ప్రారంభ వ్యాపారంపై దృష్టి పెట్టి వారిన ప్రోత్సహించడం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం అని గాడ్గిల్ చెప్పారు.
Published by: Krishna Adithya
First published: September 11, 2020, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading