వాయిదా పద్ధతిలో ఏవైనా వస్తువులు కొనాలంటే క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ కార్డ్ అవసరం. క్రెడిట్ కార్డ్ ఉందంటే ఈఎంఐలో ఏ వస్తువులైనా కొనొచ్చు. కొన్న తర్వాత ఈఎంఐ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంకు 'కార్డ్‌లెస్ ఈఎంఐ' సదుపాయాన్ని ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఏమైనా కొనాలన్నా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో షాపింగ్ చేయాలన్నా 'కార్డ్‌లెస్ ఈఎంఐ' ద్వారా సాధ్యం. ఐసీఐసీఐ బ్యాంక్ కొన్ని నెలల క్రితమే కొన్ని రీటైల్ స్టోర్లలో 'కార్డ్‌లెస్ ఈఎంఐ' ఫెసిలిటీని ప్రారంభించింది. ఇప్పుడు ఆన్‌లైన్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, టాటా క్లిక్, అర్బన్ ల్యాడర్ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఐసీఐసీఐ బ్యాంక్.
Salary: ఉద్యోగులకు అలర్ట్... వెంటనే ఈ పనిచేయకపోతే ఈ నెల జీతం రాదు
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... ఈ రెండు ప్లాన్స్‌పై బెనిఫిట్స్ మారాయి
#JustIn: #ICICIBank introduces instant ‘Cardless EMI’ facility for online purchases made on e-commerce platforms. It will offer a hassle-free experience & enhance the affordability of millions of the Bank's pre-approved customers. #CardlessEMIForOnlineShopping pic.twitter.com/5WAf5FeJT0
— ICICI Bank (@ICICIBank) June 21, 2021
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్స్ క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఈఎంఐ ద్వారా వస్తువులు కొనొచ్చు. కేవలం వారి ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఉంటే చాలు. ఇతర డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఐసీఐసీఐ బ్యాంక్ 'కార్డ్‌లెస్ ఈఎంఐ' ఫెసిలిటీ ద్వారా కస్టమర్లు రూ.5,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ తర్వాత నెలవారి వాయిదాల్లో చెల్లింపులు చేయొచ్చు. కస్టమర్లు షాపింగ్ చేసిన తర్వాత పేమెంట్ సమయంలో తమ ఫోన్ నెంబర్, పాన్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, హోమ్ అప్లయెన్సెస్, దుస్తులు... ఇలా ఆన్‌లైన్‌లో ఎలాంటి షాపింగ్‌కైనా ఐసీఐసీఐ బ్యాంక్ 'కార్డ్‌లెస్ ఈఎంఐ' ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు.
SBI Scheme: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు... స్కీమ్ వివరాలివే
Credit Card: ఈ క్రెడిట్ కార్డుతో 71 లీటర్ల పెట్రోల్ ఫ్రీ... ఆఫర్ వివరాలు ఇవే
ఐసీఐసీఐ బ్యాంక్ 'కార్డ్‌లెస్ ఈఎంఐ' ఫెసిలిటీ ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలో ఉంటుంది. కస్టమర్లు కనీసం రూ.7,000 నుంచి రూ.5 లక్షల వరకు షాపింగ్ చేయొచ్చు. ఈఎంఐ చెల్లించడానికి 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలల్లో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు తమకు 'కార్డ్‌లెస్ ఈఎంఐ' ఫెసిలిటీ వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఐసీఐసీఐ సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి CARDLESS అని టైప్ చేసి 5676766 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే వివరాలు వస్తాయి. లేదా ఐమొబైల్ యాప్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Icici, Icici bank, Online business, Online shopping, Personal Finance