Home /News /business /

ICICI BANK LAUNCHED VIDEO KYC FACILITY FOR PERSONAL LOAN CREDIT CARD AND INSTA SAVE SAVINGS ACCOUNT SS

ICICI Bank: వీడియో కేవైసీ ద్వారా అకౌంట్, లోన్, క్రెడిట్ కార్డ్... తీసుకోండి ఇలా

ICICI Bank: వీడియో కేవైసీ ద్వారా అకౌంట్, లోన్, క్రెడిట్ కార్డ్... తీసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

ICICI Bank: వీడియో కేవైసీ ద్వారా అకౌంట్, లోన్, క్రెడిట్ కార్డ్... తీసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

ICICI Bank Video KYC facility | ఐసీఐసీఐ బ్యాంకు వీడియో కేవైసీ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ ఫెసిలిటీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

    మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? క్రెడిట్ కార్డు తీసుకోవాలా? ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొనే పొందొచ్చు. వీడియో కేవైసీ ద్వారా పర్సనల్ లోన్, సేవింగ్స్ అకౌంట్, క్రెడిట్ కార్డుల్ని ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించింది ఐసీఐసీఐ బ్యాంకు. కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను వీడియో ఇంటరాక్షన్ ద్వారా చేస్తుంది. కొత్తగా ఎవరైనా సేవింగ్స్ అకౌంట్, సాలరీ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా వీడియో కేవైసీ ద్వారా ఇచ్చేందుకు ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు కూడా కస్టమర్లు ఇలాగే అప్లై చేయొచ్చు. వీడియో కేవైసీ ద్వారా సాలరీ అకౌంట్స్, పర్సనల్ లోన్స్ ఇస్తున్న తొలి బ్యాంకు తామేనని ఐసీఐసీఐ చెబుతోంది.

    వీడియో కేవైసీ ప్రాసెస్ కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. కస్టమర్లు ముఖ్యమైన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుంటే చాలు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ ద్వారా వీడియో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. కస్టమర్లు ఇన్‌స్టా సేవ్ సేవింగ్స్ అకౌంట్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసిన తర్వాత ఆన్‍లైన్‌లో వీడియో కైవైసీ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఈ లింక్ మెయిల్ ద్వారా కూడా వస్తుంది. వీడియో కేవైసీ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ లొకేషన్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫీసర్ లైన్‌లోకి వస్తారు. రియల్‌టైమ్‌లో మీ కేవైసీ పూర్తవుతుంది.

    కస్టమర్లు తమ పాన్ కార్డ్, వైట్ పేపర్, బ్లు లేదా బ్లాక్ పెన్, ఇతర ఐడీ ప్రూఫ్స్ దగ్గర పెట్టుకోవాలి. వీడియో కాల్ ద్వారానే బ్యాంకు అధికారి పాన్ కార్డ్, కస్టమర్ సంతకం, ఫోటో రికార్డ్ చేసుకుంటారు. ఆర్టిఫిషియలన్ ఇంటలిజెన్స్ ద్వారా ఆధార్ వెబ్‌సైట్‌లో ఉన్న ఫోటోతో మీ ఫేషియల్ రికగ్నిషన్ పూర్తి చేయొచ్చు. అన్నీ వీడియో కేవైసీల రికార్డ్ బ్యాంకు సిస్టమ్‌లో ఉంటుంది.
    First published:

    Tags: Bank, Bank account, Icici, Icici bank

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు