హోమ్ /వార్తలు /బిజినెస్ /

ICICI Credit Cards: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వాడేవారికి అలర్ట్‌.. అలా చేస్తే 1% ఛార్జీ చెల్లించాల్సిందే..

ICICI Credit Cards: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వాడేవారికి అలర్ట్‌.. అలా చేస్తే 1% ఛార్జీ చెల్లించాల్సిందే..

ఐసీఐసీఐ బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంకు

ICICI Credit Cards: బ్యాంకు క్రెడిట్ కార్డులను వాడేవారు అద్దె చెల్లించాలంటే ఒక శాతం ఛార్జీ చెల్లించాలని ఐసీఐసీఐ తమ కస్టమర్లకు మెసేజ్‌లు పంపుతోంది. థర్డ్‌ పార్టీ యాప్‌లలోని పే రెంట్‌ (Payrent) ఆప్షన్‌ను వినియోగించే ఐసీఐసీఐ కస్టమర్లపై (ICICI Customers) ఈ మేరకు అదనపు భారం పడనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

క్రెడిట్ కార్డుల (Credit Cards)తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల (Online Transactions)పై భారీగా తగ్గింపులు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఐసీఐసీఐ (ICICI) మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్తోంది. బ్యాంకు క్రెడిట్ కార్డులను వాడేవారు అద్దె చెల్లించాలంటే ఒక శాతం ఛార్జీ చెల్లించాలని ఐసీఐసీఐ తమ కస్టమర్లకు మెసేజ్‌లు పంపుతోంది. థర్డ్‌ పార్టీ యాప్‌లలోని పే రెంట్‌ (Payrent) ఆప్షన్‌ను వినియోగించే ఐసీఐసీఐ కస్టమర్లపై (ICICI Customers) ఈ మేరకు అదనపు భారం పడనుంది. ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయం సరైనదేననే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే క్రెడిట్‌ కార్డ్‌ల నుంచి నగదు తీసుకోవడానికి పే రెంట్ ఆప్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బ్యాంక్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనలతో వినియోగదారులపై కనిపించే ప్రభావం ఏంటో చూద్దాం.

ఈ బ్యాంకుకు భారతదేశంలో 1.1 కోట్లకు పైగా క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. వీరిలో పే రెంట్‌ ఆప్షన్‌ ద్వారా అద్దె చెల్లించడానికి చేసే ట్రాన్సాక్షన్‌లపై బ్యాంకు ఒక శాతం ఛార్జీ వసూలు చేయనుంది. దీనికి సంబంధించి బ్యాంక్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. అక్టోబర్ 20 నుంచి 1% ఛార్జీ వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ రకమైన ట్రాన్సాక్షన్లపై ఛార్జీ విధించిన తొలి బ్యాంకుగా ఐసీఐసీఐ నిలిచింది.

* రెంట్‌ పేమెంట్‌ ఆప్షన్ ఉపయోగాలు..

ప్రస్తుతం RedGiraffe, Mygate, Cred, Paytm, Magicbricks వంటి వివిధ థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్స్.. వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌ ఉపయోగించి రెంట్‌ పే చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఈ ట్రాన్సాక్షన్లపై కొంత సర్వీస్‌ ఛార్జీని వసూలు చేస్తాయి. వినియోగదారులు సంబంధిత ప్లాట్‌ఫామ్‌లో క్రెడిట్ కార్డ్ వివరాలను ఎంటర్‌ చేసి, పే రెంట్ ఆప్షన్‌కు వెళ్లి, ఎవరికి పంపాలో వారి బ్యాంకు వివరాలు లేదా యూపీఐ అడ్రెస్‌ ఎంటర్‌ చేస్తే ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది.

* ఈ ఛార్జ్ ఎందుకు?

అనేక ప్లాట్‌ఫామ్‌లు క్రెడిట్ కార్డ్‌ ఉపయోగించి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ల్యాండ్ లార్డ్‌ (రెడ్‌జిరాఫీ మినహా) ప్రామాణికతను నిర్ధారించడానికి ఎటువంటి యంత్రాంగం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. క్రెడిట్‌ కార్డ్‌ నుంచి నగదు పొందడానికి వారి బంధువులు లేదా స్నేహితులను ల్యాండ్‌ లార్డ్‌లుగా పేర్కొంటూ కొంతమంది కస్టమర్లు రెంట్ పేమెంట్స్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రెడిట్‌ కార్డ్‌ నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే దాదాపు 2.5 నుంచి 3 శాతం వరకు ఛార్జీలు ఉంటాయి. అందుకే ఈ మొత్తం చెల్లించకుండా ఉండేందుకు పే రెంట్‌ ఆప్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు.

ఇది కూాడా చదవండి : ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా టాప్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్ , ఏటీఎం చార్జీలు ఇలా!

* కస్టమర్లపై ప్రభావం

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి నెలకు రూ.12,000 అద్దె చెల్లిస్తే.. సంబంధిత ప్లాట్‌ఫారమ్ 0.4 శాతం నుంచి 2 శాతం మధ్య సర్వీస్‌ ఛార్జీ వసూలు చేయవచ్చు. 1 శాతం వసూలు చేస్తుందని అనుకుంటే.. క్రెడిట్ కార్డ్ నుంచి మొత్తం రూ.12,120 కట్‌ అవుతుంది. ఇప్పుడు బిల్లు జనరేట్ అయినప్పుడు, ట్రాన్సాక్షన్‌పై ఐసీఐసీఐ బ్యాంక్ విధించే 1 శాతం ఛార్జీ కలుపుకొని దాదాపు రూ.12,241 తిరిగి చెల్లించాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Credit card, Icici, Icici bank, Personal Finance

ఉత్తమ కథలు