ICICI Charges Hike | ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించింది. బ్యాంక్ చార్జీల పెంపు నిర్ణయం ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు (Bank Account) వర్తిస్తుంది. బ్యాంక్ ప్రకారం చూస్తే.. కొత్త సర్వీస్ చార్జ్ అమలులోకి రానుంది. 2022 నవంబర్ 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుంది.
కేవలం సర్వీస్ చార్జీల పెంపు మాత్రమే కాకుండా బ్యాంక్ పలు ట్రాన్సాక్షన్లకు సంబంధించి పెనాల్టీలను కూడా పెంచేసింది. చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు ఇది బాదుడు వర్తిస్తుంది. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి క్యాష్ డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్మెంట్, డూప్లికేట్ పాస్‌బుక్, ఐఎంపీఎస్ ఔట్వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీజనరేషన్, ఇంటర్నెట్ ఐడీ లేదా పాస్వర్డ్ తిరిగి పొందడం, చెక్ బుక్ ఇష్యూ వంటి వాటికి సర్వీస్ చార్జీలు పెరిగాయి.
ఈ 3 స్టాక్స్‌కు ఎదురులేదు.. కొంటే తిరుగులేని లాభాలు?
క్యాష్ డిపాజిట్ చార్జీలు ఇదివరకు ఉండేవి కావు. కానీ ఇప్పుడు నెలకు రూ.10 వేల లిమిట్ దాటితే రూ.50 చెల్లించుకోవాలి.డూప్లికేట్ పాస్బుక్కు ఇదివరకు చార్జీలు లేవు. ఇప్పుడు రూ.100 చెలించాలి. డెబిట్ కార్డ్ పిన్ జనరేషన్2కు రూ.25 కట్ అవుతాయి. ఇలా కొన్నింటిపై చార్జీలను అలాగే కొనసాగించింది.
శుభవార్త.. రూ.3 వేలు పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 వారాల్లోనే భారీ తగ్గుదల!
అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ రిటర్న్ ఔట్వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసే చెక్) పెనాల్టీలను రూ. 100 నుంచి రూ.200కు పెంచింది. అలాగే చెక్ రిటర్న్ ఇన్వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్)పై పెనాల్టీలు కూడా పెంచింది. ఇది వరకు రూ. 500 వరకు చార్జీ ఉంటే.. ఇప్పుడు కూడా రూ.500 ఉంది. అయితే దీనిక అదనంగా మరో రూ.50 (సిగ్నేచర్ వెరిఫికేషన్ మినహా నాన్ ఫైనాన్షియల్ రీజన్స్) పడుతుంది. అలాగే నిర్ణీత టైమ్‌లో బ్యాంక్ నుంచి కస్టమర్ పొందాల్సిన డెలివరబుల్స్ను తీసుకోకపోతే అప్పుడు రూ.50 చార్జీ పడుతుంది. ఇదివరకు ఈ చార్జీలు లేవు.
కాగా ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. ఇందులో బ్యాంక్ నికర లాభం వార్షికంగా చూస్తే ఏకంగా 37 శాతం పెరిగింది. రూ. 7558 కోట్లుగా నమోదు అయ్యింది. ఇదివరకు ఈ నికర లాభం రూ. 5511 కోట్లుగా ఉండేది. డిపాజిట్లు పెరిగాయి. అలాగే మొండి బకాయిలు తగ్గాయి. అంతేకాకుండా బ్యాంక్ ఎండీ, సీఈవోగా సందీప్ బక్షి పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Bank charges, Banks, Icici bank