ICICI Interest Rates | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ (Bank) నుంచి లోన్ (Loan) తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నెలవారీ ఈఎంఐ పైకి చేరనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని భావించే వారు గతంలో కన్నా ఇకపై అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలింది. రుణ రేట్ల పెంపు నిర్ణయం జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఓవర్ నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.4 శాతానికి చేరింది. ఇది వరకు ఈ రేటు 8.15 శాతంగా ఉండేది.
రైతులకు కేంద్రం కొత్త ఏడాది కానుక! అకౌంట్లలోకి డబ్బులు? ఎప్పుడంటే..
అలాగే మూడు నెలలు, ఆరు నెలలు ఎంసీఎల్ఆర్ రేటు అయితే వరుసగా 8.45 శాతం, 8.6 శాతానికి చేరాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతానికి ఎగసింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును బ్యాంకులు కన్సూమర్ లోన్స్‌కు ప్రామాణికంగా తీసుకుంటాయి. అంటే ఆటో లోన్, పర్సనల్ లోన్ , హోమ్ లోన్ వంటి వాటిని ఏడాది ఎంసీఎల్ఆర్‌ను పరిగణలోకి తీసుకుంటాయి. దీనికి మార్జిన్, రిస్క్ ప్రీమియం యాడ్ చేసి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.
ఎస్‌బీఐ అదిరిపోయే స్కీమ్.. చౌక వడ్డీకే రూ.10 లక్షల రుణం, కొంత కాలమే ఈ ఆఫర్!
కాగా కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇండియన్ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. అంటే మరిన్ని బ్యాంకులు ఈ దారిలో నడిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 7.75 శాతానికి చేరింది. నెల రోజుల నుంచి ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు అయితే 20 బేసిస్ పాయింట్లు పైకి కదిలింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు రేటు 8.3 శాతంగా ఉంది. ఇదివరకు ఈ రేటు 8.2 శాతంగా ఉండేది. అంటే పది బేసిస్ పాయింట్లు పైకి కదిలింది. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా వరుసపెట్టి రుణ రేట్లను పెంచుకుంటూ వస్తున్నాయి. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ పడుతోంది. డబ్బులు దాచుకునే వారికి ఊరట లభిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Home loan, Icici, Icici bank, Mclr, Personal Finance, Personal Loan