FD Rates | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. బ్యాంకులో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) వెల్లడించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని చూస్తే వారికి ప్రయోజనం కలుగుతుంది. గతంలో కన్నా ఇకపై కస్టమర్లకు అధిక రాబడి లభిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా రూ. 2 కోట్లకు లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. ఎంపిక చేసిన టెన్యూర్లలోని ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎఫ్డీ రేట్లు 20 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి. అక్టోబర్ 18 నుంచి ఎఫ్డీ రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చింది. అంటే ఈరోజు నుంచే వడ్డీ రేట్లు పైకి కదిలాయి.
ఈ స్టాక్ చాలా హాట్ గురూ.. అందరూ దీని వెనకే, కొంటే భారీ లాభం!
బ్యాంక్ ఇప్పుడు కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.2 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్‌లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ కూడా మారుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుభవార్త.. వారికి అదిరిపోయే గుడ్ న్యూస్
బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. 185 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. వడ్డీ రేటు 4.9 శాతం నుంచి 5 శాతానికి ఎగసింది. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై అయితే వడ్డీ రేటు 5.8 శాతానికి పెరిగింది. ఇది వరకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.7 శాతంగా ఉండేది. బ్యాంక్ అలాగే 91 రోజుల నుంచి 184 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి 4.25 శాతానికి చేరింది.
అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ 2 ఏళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో టెన్యూర్లపై వడ్డీ 5.8 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఒక్క రోజు నుంచి ఐదేళ్ల ఎఫ్డీలపై అయితే 6.2 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై అయితే వడ్డీ రేటు 6.1 శాతానికి చేరింది. కాగా సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 6.75 శాతం వరకు లభిస్తోంది. అదే రికరింగ్ డిపాజిట్లను గమనిస్తే.. 4.25 శాతం నుంచి 6.2 శాతం వరకు వడ్డీ వస్తుంది. 6 నెలల నుంచి 10 ఏళ్ల టెన్యూర్‌తో డబ్బులు రికరింగ్ డిపాజిట్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Icici bank, Personal Finance