Fixed Deposits | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఒకే రోజు మూడు శుభవార్తలు అందించింది. దీంతో కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. కస్టమర్లకు అధిక రాబడి రానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో (HFDC Bank) పోటీపడుతూ వస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా అందించిన మూడు శుభవార్తలు ఏంటివో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంక్ ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. అక్టోబర్ నెలలో బ్యాంక్ ఎఫ్డీ రేట్లు పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఎస్బీఐ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటివి కూడా ఇటీవలనే ఒకే నెలలో రెండు సార్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు ఐసీఐసీఐ కూడా వీటి దారిలోనే పయనించింది.
అదృష్టం అంటే ఇదే.. 2 నెలల్లో డబ్బు రెట్టింపు, ఉచితంగా బోనస్ షేర్లు!
అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ మళ్లీ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్‌పై అందించే అదనపు వడ్డీని పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ స్కీమ్‌లో చేరాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అధిక రాబడి లభిస్తుంది. అదనపు వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అంటే ఇప్పుడు గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్‌పై అదనంగా 20 బేసిస్ పాయింట్ల వడ్డీ వస్తుంది.
18 బ్యాంకుల కస్టమర్లను టార్గెట్ చేసిన ఆండ్రాయిడ్ వైరస్.. మీ అకౌంట్లోని డబ్బుల్ని ఎలా కొట్టేస్తుందంటే?
ఈ స్కీమ్ కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. వీరికి సాధారణంగా 0.5 శాతం అదనపు వడ్డీ వస్తుంది. దీనికి అదనంగా గోల్డెన్ ఇయర్స్ స్కీమ్‌లో చేరిన వారికి 0.2 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. మొత్తంగా 0.7 శాతం ఎక్కువ రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
అదనపు వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్‌పై ఇప్పుడు 6.95 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితితో డబ్బులు ఎఫ్డీ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 29 నుంచి ఈ కొత్త వడ్డీ రేటు వర్తిస్తుంది. కొత్తగా ఈ స్కీమ్‌లో చేరే వారికే కొత్త వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే ఎఫ్డీలను రెన్యూవల్ చేసుకున్న కూడా కొత్త వడ్డీ రేటు పొందొచ్చు. కాగా ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ పొందొచ్చు. అంటే డబ్బులు టెన్యూర్ కన్నా ముందే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే పెనాల్టీ పడుతుంది. 1.1 శాతం చార్జీ చెల్లించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Icici bank, Personal Finance