Home /News /business /

ICICI BANK HIKE MCLR RATE INTEREST RATES TO RISE HOW YOUR LOAN EMIS WILL BE AFFECTED FROM TODAY KNOW HERE VB

ICICI Bank Hike MCLR Rate: పెరగనున్న వడ్డీ రేట్లు.. కొత్త, పాత వాళ్లకు కూడా, ఈఎంఐలు షాక్ ఇస్తాయా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో అదిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ ICICI MCLR రేటును 20 బేసిస్ పాయింట్లను పెంచింది. ఈ పెంపుతో వడ్డీ రేట్లు పెరగనున్నాయి.

దేశంలో అదిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ MCLR రేటును 20 బేసిస్ పాయింట్లను పెంచింది. ఈ పెంపుతో వడ్డీ రేట్లు(Interest Rates) పెరగనున్నాయి. దీంతో పాటు హోం లోన్(Home Loan), కార్ లోన్(Car loan) ఇతర లోన్తీలు సుకున్న వారికి ఈఎంఐలో మార్పులు రానున్నాయి.  దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  గత నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దీంతో అనేక బ్యాంకులు(Banks) తమ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దానిలో ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు(Fixed Deposit Interest Rates) కూడా ఉన్నాయి. ఇదే సమయంలో ప్రైవేట్ బ్యాంక్(Private Bank) అయిన ICICI కూడా MCLR రేటును 20 బేసిస్ పాయింట్లను పెంచినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ICICI బ్యాంక్ MCLR రేట్లు అమలులోకి వచ్చాయి.

Aarogya Sri Jobs In Ap: ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలు.. ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులు.. జీతం రూ.18వేలు..


పెంచిన MCLR రేట్లు జూలై 1 నుండి అమల్లోకి వచ్చాయి. ICICI బ్యాంక్ MCLR రేటు పెంపు అంటే కొత్త అండ్ ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు కూడా రుణ వడ్డీలు పెరుగుతాయి. దీనిలో హోం లోన్, వెహికిల్ లోన్ తో పాటు.. నెలవారీగా చెల్లించే ఈఎంఐలు(EMI) కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు 8.60 శాతంగా నిర్ణయించబడింది. ఇది జూన్ 8, 2022 నుండి అమలులోకి వస్తుందని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది . ఐసిఐసిఐ బ్యాంక్ గత నెల జూన్ 1 న ఆర్బీఐ ఎమ్‌పిసి సమావేశానికి ముందు తన MCLR రేట్లను పెంచింది, అక్కడ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రెపో రేట్లను 4.90 శాతానికి పెంచింది. MCLR లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. ఇది బ్యాంకులు తన కస్టమర్‌లకు రుణాలు ఇవ్వడానికి అనుమతించబడే కనీస వడ్డీ రేటు.



వారం క్రితం ఐసీఐసీఐ బ్యాంక్ తన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుందని పేర్కొంది. జూన్ 28 నుంచి ఈ రేట్లు అమలులోకి వచ్చాయి. గతంలో కంటే.. ప్రస్తుతం ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రానుంది.

Business Idea: తక్కువ పెట్టుబడి.. మూడు రెట్ల ఆదాయం.. ఈ బిజినెస్ పై ఓ లుక్కేయండి..


ఇదే క్రమంలో ఎంసీఎల్ఆర్(MCLR) రేటును పెంచడంతో.. రుణ గ్రహీతలకు అధిక బారం పడనుంది.  ప్రస్తుతం ICICI Bank యొక్క ఎంసీఎల్ ఆర్ రేట్లు 7.50 నుంచి 7.75 శాతం మధ్యలో ఉంది. ICICI బేస్ రేట్ 8.85 శాతంగా ఉంది. ఓవర్ నైట్ 7.50 శాతం, ఒక నెల 7.50 శాతం, మూడు నెలలు 7.55 శాతం, ఆరు నెలలు 7.70 శాతం, ఒక సంవత్సరానికి 7.75 శాతంగా MCLR రేట్లు ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: High interest rates, Icici, Icici bank

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు