ICICI BANK FIXED DEPOSITS INTEREST RATES HIKED SEE LATEST FIXED DEPOSIT INTEREST RATES HERE GH VB
ICICI FD Rates: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎఫ్డీ రేట్లు పెంపు.. సవరించిన రేట్లు ఇవే!
(ప్రతీకాత్మక చిత్రం)
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ (ICICI) తన ఎఫ్డీ (FD) ఖాతాదారులకు తీపి కబురు అందించింది. తన ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits) లేదా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను మరోసారి పెంచింది.
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్(Private Bank) అయిన ఐసీఐసీఐ (ICICI) తన ఎఫ్డీ (FD) ఖాతాదారులకు తీపి కబురు(Good News) అందించింది. తన ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits) లేదా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను(Interest Rates) మరోసారి పెంచింది. ఐసీఐసీఐ ఎఫ్డీ వడ్డీ రేటు పెంపు (FD Interest Hike) మంగళవారం నుంచి అంటే జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఎఫ్డీ వడ్డీ రేట్లు బ్యాంకులో రూ. 2 కోట్ల కంటే ఎక్కువ.. రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లకు(Deposits) వర్తిస్తాయి. దేశీయ, ఎన్ఆర్ఓ(SRO), ఎన్ఆర్ఈ డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంచినట్లు బ్యాంక్ తన వెబ్సైట్లో(Website) తెలిపింది. సీనియర్ సిటిజన్(Senior Citizens) విషయానికొస్తే ఈ రేట్లు దేశీయ ఎఫ్డీలకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ నోట్లో(Bank Note) స్పష్టం చేసింది. మరి జూన్ 7, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్లో రూ.2 కోట్ల కంటే ఎక్కువ.. రూ. 5 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు ఇలా..
- 7 రోజుల నుంచి 14 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం వడ్డీ లభిస్తుంది.
- అదే విధంగా 15 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం వడ్డీ అందుతుంది.
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం
- 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం
- 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం వడ్డీ బ్యాంక్ చెల్లిస్తుంది. ఈరోజు ఆర్బీఐ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఐసీఐసీఐతో సహా అన్ని బ్యాంకులు ఎఫ్డీ వడ్డీ రేట్లను త్వరలోనే మళ్లీ పెంచే అవకాశం ఉందని సమాచారం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.