Bank Loan | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. లోన్ తీసుకోవాలని యోచించే వారికి పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. పర్సనల్ లోన్ (Personal Loan), హోమ్ లోన్ (Home Loan), ట్రాక్టర్ లోన్, టూవీలర్ లోన్ ఇలా రుణాలపై పలు రకాలు ఆఫర్లు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజాలో భాగంగా ఈ ప్రయోజనాలు కల్పిస్తోంది. ఏ ఏ రుణాలపై ఎలాంటి ప్రయోజనం పొందొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం.
సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లకు ప్రి అప్రూవ్డ్ హోమ్ లోన్స్ అందుబాటులో ఉంచింది. అలాగే ప్రి అప్రూవ్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కూడా అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కేవలం రూ. 1100 మాత్రమే. అలాగే కస్టమర్లు హోమ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు పొందొచ్చు. లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ రుణాలకు కూడా ఇదే వర్తిస్తుంది.
7 నెలల కనిష్టానికి కుప్పకూలిన బంగారం ధర.. కారణం ఇదే! నేటి రేట్లు ఇలా
అలాగే కారు రుణాలపై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారు కారు ఆన్‌రోడ్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. అలాగే సెకండ్ హ్యాండ్ కారుపై కూడా లోన్ పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 8 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డుదారులకు కొత్త సేవలు.. ఇక మరింత భద్రంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!
అలాగే కన్సూమర్ ఫైనాన్స్ ఆఫర్లు కూడా ఉన్నాయి. యాపిల్ , వన్‌ప్లస్ , శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, వోల్టస్ వంటి బ్రాండ్లకు చెందిన ప్రొడక్టుల కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ పొందొచ్చు. క్రోమా, రిలయన్స్ డిజిటల్స్, విజయ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్‌లో కూడా ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
ఇంకా పర్సనల్ లోన్స్‌పై కూడా ఆఫర్ ఉంది. ప్రిక్లోజర్ చార్జీలు ఉండవని వెల్లడించింది. 12 ఈఎంఐలు కట్టిన తర్వాతనే ఈ వెసులుబాటు లభిస్తుంది. అదే 12 ఈఎంఐలు కట్టకముందే పర్సనల్ లోన్ క్లోజ్ చేయాలంటే 3 శాతం చార్జీ చెల్లించుకోవాలి. అలాగే ట్రాక్టర్ లోన్ కూడా పొందొచ్చు. లోన్ టెన్యూర్ 6 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. 90 శాతం మొత్తం రుణం రూపంలో లభిస్తుంది. ఇంకా టూవీలర్ లోన్ తీసుకుంటే తక్కువ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 100 శాతం ఫైనాన్స్ పొందొచ్చు. ఈఎంఐ రూ. 1000కి రూ. 30 నుంచి ప్రారంభం అవుతోంది. అంటే లోన్ తీసుకునే వారికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Home loan, Icici bank, Latest offers, Personal Loan