Golden years Deposits: ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ గ‌డువు పెంపు... వ‌డ్డీరేటు ఎంతో తెలుసా?

(ప్రతీకాత్మక చిత్రం)

ఎఫ్‌డీల‌పై ప్ర‌స్తుతం బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందిస్తున్నవ‌డ్డీరేట్ల‌తో పోలిస్తే.. ఐసీఐసీఐ బ్యాంకు ఆక‌ర్ష‌ణీయ‌మైన రేట్ల‌ను అందిస్తోంది.

  • Share this:
సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప్ర‌వేశ‌పెట్టిన గోల్డెన్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ గ‌డువును ఐసీఐసీఐ బ్యాంకు పొడిగించింది. గత నెలలోనే ముగిసిన ఈ గ‌డువును 2021 అక్టోబ‌రు 7 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంలో సీనియ‌ర్ సిటిజ‌న్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఇచ్చే వ‌డ్డీని బ్యాంకులు త‌గ్గిస్తున్న త‌రుణంలో ఐసీఐసీఐ బ్యాంకు వ‌డ్డీరేట్ల‌ను పెంచ‌డం విశేషం. ఎఫ్‌డీల‌పై ప్ర‌స్తుతం బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందిస్తున్నవ‌డ్డీరేట్ల‌తో పోలిస్తే.. ఐసీఐసీఐ బ్యాంకు ఆక‌ర్ష‌ణీయ‌మైన రేట్ల‌ను అందిస్తోంది. ప్రస్తుతం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు గోల్డెన్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ కింద 0.30శాతం వ‌డ్డీ రేటును అద‌నంగా అందిస్తోంది. రూ.2 కోట్ల కంటే త‌క్కువ మొత్తం క‌లిగిన‌ సింగిల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఈ వ‌డ్డీరేటును వ‌ర్తింప‌చేస్తోంది. ఇప్ప‌టికే అద‌నంగా ఇస్తున్న 0.50శాతం వ‌డ్డీకి ఇది అద‌నం. ఈ వ‌డ్డీరేట్లు కేవ‌లం ఐదేళ్ళ నుంచి ప‌దేళ్ళ కాల‌ప‌రిమితితో చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై, రెన్యువ‌ల్ చేసుకునే డిపాజిట్ల‌పై వ‌ర్తిస్తాయ‌ని బ్యాంకు పేర్కొంది.
Bank Deposits: బ్యాంకులో మీ డబ్బులు భద్రంగానే ఉన్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Amazon Smartphone Upgrade Days sale: అమెజాన్ లో ఈ ఐదు ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. ఈ ఒక్కరోజే ఛాన్స్.. వివరాలివే

అలాగే మెచూరిటీకి ముందే విత్‌డ్రా చేసుకునే డిపాజిట్ల‌పై 1.30 శాతం పెనాల్టీని వ‌సూలు చేస్తామ‌ని, ఈ ప‌థ‌కంలోని ష‌ర‌తుల‌న్నీ య‌థాత‌థంగానే ఉన్నాయ‌ని ఐసీఐసీఐ బ్యాంకు ప్ర‌క‌టించింది. ఈ గోల్డెన్ ఇయ‌ర్స్ స్కీమే కాకుండా ఐసీఐసీ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల స్వ‌ల్ప‌, దీర్ఘ‌కాల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్ట‌కుని చ‌క్క‌ని రాబ‌డి వ‌చ్చేలా డిపాజిట్ స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. వీటిలో రెగ్యుల‌ర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌, మ‌నీ మ‌ల్టీప్ల‌య‌ర్ ఎఫ్‌డీ, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి.

ఇటీవ‌ల లీడింగ్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ‘వీ కేర్’ పేరుతో ప్ర‌వేశ‌పెట్టిన స్పెష‌ల్ ట‌ర్మ్ డిపాజిట్ల ప‌థ‌కం గ‌డువును 2021 సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించాయి. ఐదేళ్ళ నుంచి ప‌దేళ్ళ కాల‌ప‌రిమితితో సీనియ‌ర్ సిటిజ‌న్లు చేసే డిపాజిట్ల‌కు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.20 శాతం వ‌డ్డీని అందిస్తుండ‌గా, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలు ఇదే కాల‌ప‌రిమితి ఉన్న డిపాజిట్ల‌కు 6.25శాతం వ‌డ్డీ చెల్లిస్తున్నాయి.
Published by:Nikhil Kumar S
First published: