ICICI Bank: ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

ICICI Bank Cardless Cash Withdrawal | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడానికి ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు iMobile యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఎప్పుడైనా రూ.20,000 వరకు డ్రా చేయొచ్చు. మీకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన వివరాలు, 4 అంకెల టెంపరరీ పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు.

news18-telugu
Updated: January 23, 2020, 5:19 PM IST
ICICI Bank: ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా
ICICI Bank: ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI యోనో క్యాష్ ఫీచర్ గురించి మీకు తెలుసా? ఈ ఫీచర్ ద్వారా ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉంటే డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. సరిగ్గా ఇలాంటి ఫీచర్‌నే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు కూడా 'కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్' ఫీచర్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఏటీఎం కార్డు మర్చిపోయినా పర్లేదు. డబ్బులు డ్రా చేయడం సులువే. దేశంలోని 15,000 ఏటీఎంలల్లో ఈ సదుపాయం ఉంది. ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడానికి ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు iMobile యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఎప్పుడైనా రూ.20,000 వరకు డ్రా చేయొచ్చు. మీకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన వివరాలు, 4 అంకెల టెంపరరీ పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు.


ICICI Bank Cardless Cash Withdrawal: ఏటీఎం కార్డు ఉపయోగించకుండా డబ్బులు డ్రా చేయండి ఇలా


ముందుగా iMobile యాప్ ఓపెన్ చేసి Services సెక్షన్‌లోకి వెళ్లాలి.
Cardless Cash Withdrawal –Self ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
మీరు డ్రా చేయాలనుకుంటున్న అమౌంట్, 4 అంకెల టెంపరరీ పిన్, మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది.
అందులో 6 అంకెల కోడ్ ఉంటుంది.
ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీరు సెట్ చేసిన 4 అంకెల తాత్కాలిక పిన్, మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల కోడ్ ఎంటర్ చేయాలి.
మీరు ముందు ఎంటర్ చేసిన అమౌంట్‌నే ఏటీఎంలో కూడా ఎంటర్ చేయాలి.
మీరు ఎంటర్ చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉంటే డబ్బులు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

Pension Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్

Save Money: రూ.1 కోటి కావాలంటే ఇలా పొదుపు చేయండి

Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చు
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు