ICICI Credit Card | మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అది కూడా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) క్రెడిట్ కార్డు (Credit Card) కలిగి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 7,500 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ ఆఫర్ల గురించి తెలుసుకోవాల్సిందే.
ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా కార్యక్రమంలో భాగంగా పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లపై కూడా కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఒప్పొ, వివో , షావోమి వంటి దిగ్గజ బ్రాండ్లకు చెందిన ఫోన్లపై ఆఫర్లు పొందొచ్చు. అంతేకాకుండా నో ఎక్స్ట్రా కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఏ ఏ మోడల్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్!
వివో స్మార్ట్ఫోన్లపై గరిష్టంగా రూ. 6 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎక్స్80ప్రో మోడల్‌కు ఇది వర్తిస్తుంది. ఎక్స్80 మోడల్‌పై అయితే రూ. 4 వేల క్యాష్‌బ్యాక్ ఉంది. వీ23 ఫోన్‌పై రూ. 3,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వై75 ఫోన్‌పై రూ. 1500, టీ1 5జీ ఫోన్‌పై రూ. 1000 తగ్గింపు అందుబాటులో ఉంది. వీటిపై 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. డిసెంబర్ చివరి వరకు ఆఫర్లు ఉంటాయి.
ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏటీఎం , డెబిట్ కార్డు కొత్త రూల్స్, ఈరోజు నుంచి మారే అంశాలివే!
అలాగే ఒప్పొ స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్లపై రూ. 4 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఏ అండ్ కే సిరీస్ ఫోన్లపై అయితే రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. ఇక రెనో సిరీస్ ఫోన్లపై రూ. 4 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఫోన్లపై కూడా 12 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఆఫర్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది.
ఇక షావోమి ఫోన్లపై ఆఫర్లు తెలుసుకుంటే.. గరిష్టంగా రూ. 7,500 వరకు తగ్గింపు పొందొచ్చు. షావోమి టీవీలు, ట్యాబ్లెట్స్, ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ కూడా ఈ నెల చివరి వరకు ఉంటుంది. మీరు షావోమి ప్రొడక్టు ఏమీ కొన్నా కూడా ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మీరు చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Credit card, Icici, Icici bank, Latest offers, Mobile offers, Smartphones