హోమ్ /వార్తలు /బిజినెస్ /

Credit Card: ఐసీఐసీఐ కొత్త క్రెడిట్ కార్డు.. రూ.500తో రూ.2 లక్షల బెనిఫిట్‌, ఇంకా లాభాలెన్నో!

Credit Card: ఐసీఐసీఐ కొత్త క్రెడిట్ కార్డు.. రూ.500తో రూ.2 లక్షల బెనిఫిట్‌, ఇంకా లాభాలెన్నో!

ఐసీఐసీఐ కొత్త క్రెడిట్ కార్డు.. రూ.500తో రూ.2 లక్షల బెనిఫిట్‌, ఇంకా లాభాలెన్నో!

ఐసీఐసీఐ కొత్త క్రెడిట్ కార్డు.. రూ.500తో రూ.2 లక్షల బెనిఫిట్‌, ఇంకా లాభాలెన్నో!

ICICI Credit Card | మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డు వచ్చేసింది. ఈ కార్డు వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. మూవీ టికెట్లపై తగ్గింపుతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే రివార్డు పాయింట్లు సొంతం చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  ICICI Bank | కొత్త క్రెడిట్ కార్డు పొందాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కొత్త క్రెడిట్ కార్డును (Credit Card) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డును మార్కెట్‌లో ఆవిష్కరించింది. రూపే నెట్‌వర్క్‌పై కార్డును తీసుకువచ్చింది. దీని పేరు ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ రూపే క్రెడిట్ కార్డు.

  ఈ కొత్త రూపే క్రెడిట్ కార్డు అనేది కాంటాక్ట్‌లెస్ కార్డు. ఈ కార్డు తీసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. షాపింగ్, రెస్టారెంట్లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపు వంటి వాటిపై రివార్డు పాయింట్లు పొందొచ్చు. కాంప్లిమెంటరీ డొమెస్టక్ ఎయిర్‌పోర్ట్, రైల్వే లాంజ్ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది. మూవీ టికెట్లపై తగ్గింపు పొందొచ్చు. ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

  అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్స్, సిలిండర్ వరకు మారే 8 అంశాలివే

  ఇంకా రూపే నెట్‌వర్క్‌పై ఈ కార్డును తీసుకురావడం వల్ల ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ బెనిఫిట్ పొందొచ్చు. ఇన్నోవేటివ్, పవర్‌ఫుల్, కస్టమర్లకు అధిక విలువను చేకూర్చడంలో ఐసీఐసీఐ బ్యాంక్ ముందు వరుసలో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ హెడ్ సుదిప్తా రాయ్ తెలిపారు. ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డును తీసుకురావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

  2-3 రోజులు టూర్ ప్లాన్ చేస్తున్నారా? టాప్ 8 టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే!

  ఈ కొత్త క్రెడిట్ కార్డులతో ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయోజనాలన, రూపే ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్‌ను ఒకేసారి సొంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్‌పీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ మాట్లాడుతూ.. ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో కోరల్ క్రెడిట్ కార్డు తీసుకువచ్చామన్నారు. రూపే నెట్‌వర్క్‌పై ఇది పని చేస్తుందని తెలిపారు.

  ఈ కార్డు ద్వారా చేసే ప్రతి రూ.100 కొనుగోలుపై 2 రివార్డు పాయింట్లు వస్తాయి. యుటిలిటీ, ఇన్సూరెన్స్ కేటగిరిల్లో ఖర్చుపై రూ.100కు ఒక రివార్డు పాయింట్ వస్తుంది. ఏడాదిలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే 2 వేల బోనస్ రివార్డు పాయింట్లు పొందొచ్చు. రూ.లక్ష ఖర్చు చేసిన ప్రతి సారి 1000 బోనస్ రివార్డు పాయింట్లు వస్తాయి. బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేస్తు తగ్గింపు వస్తుంది. రూ.2 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది. కార్డు జాయినింగ్ ఫీజు రూ.500. వార్షిక ఫీజు రూ.500గా ఉంటుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Credit card, Icici bank, Money

  ఉత్తమ కథలు