Bank Account | ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా శుభవార్త అందించింది. కస్టమర్లకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంక్ తాజాగా 3 ఇన్ 1 సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కస్టమర్లకు ఊరట కలుగనుంది. కేవలం సేవింగ్స్ అకౌంట్ (Account) తెరిస్తే చాలు డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ సేవలు కూడా పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు (Money) ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
బ్యాంక్ అకౌంట్‌తోనే ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను కూడా కలిగి ఉండొచ్చు. ఆన్‌లైన్‌లోనే కస్టమర్లకు ఈ సేవలు పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఎక్కడి నుంచైనా ఈ 3 ఇన్ 1 ఖాతా తెరవొచ్చని తెలియజేస్తోంది. ఈ కొత్త సర్వీసుల వల్ల స్టాక్ బ్రోకర్లు కూడా వారి డిపాజిటరీ సిస్టమ్స్‌ను బ్యాంక్‌తో లింక్ చేసుకోవచ్చని వివరించింది. ఏపీఐ ద్వారా ఈ పరి పూర్తి చేసుకోవచ్చని పేర్కొంటోంది. ఇన్వెస్టర్ల ఫండ్స్‌కు సంబంధించిన రియల్‌టైమ్ ఇన్‌ఫర్మేషన్ వారికి లభిస్తుందని తెలిపింది.
డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కలిగిన వారికి కేంద్రం అదిరే శుభవార్త!
అంతేకాకుండా కొన్ని గంటల వ్యవధిలోనే సేవింగ్స్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ చేయొచ్చని బ్యాంక్ తెలిపింది. దీని ద్వారా ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ చాలా సులభతరం అవుతుందని వివరించింది. ఇంకా ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐలకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ తీసుకువచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.
ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐలు వారి ప్రి వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే ఇన్‌ఫర్మేషన్ పొందొచ్చు. రిజిస్ట్రేషన్, ఆన్‌బోర్డింగ్ టైమ్ చాలా తగ్గిపోతుందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ లార్జ్ క్లయింట్స్ గ్రూప్ హెడ్ సుమిత్ సంఘై మాట్లాడుతూ.. ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా పరుగులు పెడుతూ వస్తోందని తెలిపారు. డీమ్యాట్ ఖాతాల పెరుగుదల అంశం దీన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం కూడా పెరిగిందని తెలిపారు.
బ్యాంక్ తీసుకువచ్చిన డిజిటల్ సొల్యూషన్స్ అనేవి మార్కెట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీంతో స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు ఈ కొత్త సర్వీసుల ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండానే సులభంగానే డీమ్యాట్, ట్రేడింగ్, సేవింగ్స్ ఖాతాలను పొందొచ్చు. ఇకపోతే ఈ సర్వీసుల పొందటానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చార్జీలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తర్వాతనే తీసుకోవాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, Icici bank, Stock Market