హోమ్ /వార్తలు /బిజినెస్ /

ICICI Festive Bonanza: ఐసీఐసీఐ ఫెస్టివ్ బొనాంజా.. కస్టమర్లకు రూ.25,000 వరకు బెనిఫిట్స్.. ఇలా పొందండి..

ICICI Festive Bonanza: ఐసీఐసీఐ ఫెస్టివ్ బొనాంజా.. కస్టమర్లకు రూ.25,000 వరకు బెనిఫిట్స్.. ఇలా పొందండి..

ఐసీఐసీఐ బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంకు

ICICI Festive Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ ‘ఫెస్టివ్ బొనాంజా (Festive Bonanza)’ పేరుతో కస్టమర్లకు రూ.25,000 వరకు విలువైన సేవింగ్స్, క్యాష్‌బ్యాక్‌ల బెనిఫిట్స్ ప్రవేశపెట్టింది. ఈ కళ్లు చెదిరే ప్రయోజనాలను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ (Festival Season) మొదలైంది. దీంతో బిజినెస్ పెంచుకునేందుకు వివిధ కంపెనీలు కొనుగోలుదారులకు అత్యుత్తమ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు బ్యాంకింగ్ సంస్థలు సైతం క్యాష్‌బ్యాక్, సేవింగ్ ఆఫర్స్ (Savings Offers) ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI) తన కస్టమర్ల కోసం అనేక రకాల ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ బ్యాంకు ‘ఫెస్టివ్ బొనాంజా (Festive Bonanza)’ పేరుతో కస్టమర్లకు రూ.25,000 వరకు విలువైన సేవింగ్స్, క్యాష్‌బ్యాక్‌ల బెనిఫిట్స్ ప్రవేశపెట్టింది. ఈ కళ్లు చెదిరే ప్రయోజనాలను ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కస్టమర్ల కోసం లాంచ్ చేసిన ‘ఫెస్టివ్ బొనాంజా’లో భాగంగా వస్తువుల కొనుగోళ్లు, ఖర్చులపై అనేక ఆఫర్లు, తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా తెలిపారు.

"మేం అనేక రకాల ప్రొడక్ట్స్, సర్వీసులు, ప్రముఖ బ్రాండ్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి ఈ ఆఫర్లు తీసుకొస్తున్నాం. వీటితో పాటు బ్యాంకింగ్ సొల్యూషన్లలో సైతం పండుగ ప్రయోజనాలను తీసుకొచ్చాం. తద్వారా హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, ప్రాపర్టీపై లోన్, వెహికల్, టూవీలర్, పర్సనల్ లోన్స్‌పై పండుగ ఆఫర్లను కస్టమర్లు ఆస్వాదించవచ్చు.’’ అని రాకేష్ ఝా పేర్కొన్నారు.

* ఐసీఐసీఐ ఆఫర్స్ పొందడం ఎలా?

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్స్యూమర్ ఫైనాన్స్ లేదా కార్డ్‌లెస్ EMIని ఉపయోగించి ఫెస్టివ్ బొనాంజా ఆఫర్స్ దక్కించుకోవచ్చు. కస్టమర్లు తమ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లతో EMI పేమెంట్స్‌తో కూడా ఈ ఆఫర్లు పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎలక్ట్రిక్స్, గ్యాడ్జెట్లు, జ్యువలరీ, ఆటోమొబైల్, ఫర్నీచర్ మొదలైన వర్గాల నుంచి కస్టమర్ల పండుగ డిమాండ్‌లను తీర్చడానికి ఈ ఆఫర్లను పక్కా ప్లాన్‌తో తీసుకొచ్చింది. కస్టమర్లు తమ కొనుగోళ్లను మరింత చౌకగా మార్చేందుకు కార్డ్‌లెస్ EMI, ‘నో-కాస్ట్ EMI’ వంటి ఫెసిలిటీస్ యూజ్‌ చేయవచ్చు.

* ‘ఫెస్టివ్ బొనాంజా’ డీల్స్‌, ఆఫర్లు ఏంటి?

ఐసీఐసీఐ కస్టమర్లు బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కేటగిరీల వారీగా ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

- ప్రముఖ బ్రాండ్స్‌, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ , Myntra, Tata Cliq, Ajio Luxeలో చేసే ఆన్‌లైన్ షాపింగ్‌పై 10% తగ్గింపు పొందొచ్చు.

- ఎలక్ట్రానిక్, గ్యాడ్జెట్లు

ఎల్‌జీ, క్యారియర్, డెల్, యురేకా ఫోర్బ్స్, హెయిర్, సోనీ, వోల్టాస్, వర్ల్‌పూల్ మొదలైన కంపెనీలో ప్రొడక్ట్స్‌పై 10% వరకు క్యాష్‌బ్యాక్.

- గ్లోబల్ లగ్జరీ బ్రాండ్స్‌

అర్మానీ ఎక్స్ఛేంజ్, క్లార్క్స్, డీజిల్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్, పాల్ & షార్క్, సత్య పాల్, స్టీవ్ మాడెన్ వంటి లగ్జరీ బ్రాండ్‌లపై అదనంగా 10% తగ్గింపును అందుకోవచ్చు.

- మొబైల్ ఫోన్లు

నెలకు రూ.2,497తో ప్రారంభమయ్యే ఇన్‌స్టంట్ EMIతో ఐఫోన్ 14ని సొంతం చేసుకోవచ్చు. Mi, వన్‌ప్లస్ , రియల్‌మీ , ఒప్పో, వివో ఫోన్లపై కూడా ఆఫర్లు పొందొచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Festival, Icici bank, Personal Finance

ఉత్తమ కథలు