Stock Market Today | మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మార్కెట్లో (Share Market) ప్రస్తుతం ఒక స్టాక్ హాట్ ఫేవరెట్‌గా ఉంది. బ్రోకరేజ్ సంస్థలు అన్నింటికీ ఈ స్టాక్ ముద్దుల స్టాక్‌గా (Stock) కొనసాగుతోంది. ఈ స్టాక్‌ను కొనొచ్చని సిఫార్సు చేస్తున్నాయి. విక్రయించండి అని ఏ బ్రోకరేజ్ సంస్థ కూడా రేటింగ్ ఇవ్వలేదు. దాదాపు అన్ని కూడా బై రేటింగ్ ఇచ్చాయి. అంటే ఈ షేరుపై అందరూ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఆ షేరు ఏంటని అనుకుంటున్నారా? అదే ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్. ఈ స్టాక్ రికార్డ్ గరిష్ట స్థాయి రూ. 958 సమీపంలో కదలాడుతూ ఉంది. ఈ షేరులో బుల్లిష్ మొమెంటమ్ కనిపిస్తోంది. 40 మంది అనలిస్ట్‌లు ఈ షేరుపై సానుకూలముగా ఉన్నారు. 23 మంది ఐసీఐసీఐ బ్యాంక్ షేరు కచ్చితంగా కొనొచ్చని సిఫార్సు చేస్తున్నారు. అలాగే 16 మంది కొనొచ్చని రికమెండ్ చేస్తున్నారు. ఇక ఒక్కరు మాత్రం షేరును హోల్డ్ చేయొచ్చని, అంటే అలాగే కొనసాగించొచ్చని సూచిస్తున్నారు. ఒక్కరు కూడా సెల్ రేటింగ్ ఇవ్వలేదు.
ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్, ఇకపై క్షణాల్లో..
వ్యూహాత్మక భాగస్వామ్యాలు, డిజిటైజేషన్, నెట్వర్క్ విస్తరణ, ఎస్ఎంఈ ఫైనాన్స్‌పై ఫోకస్, సప్లై చెయిన్ ఫైనాన్సింగ్ వంటి పలు అంశాల కారణంగా ఈ బ్యాంక్ స్టాక్ అందరి ఫేవరెట్‌గా మారిందని చెప్పుకోవచ్చు. తమ టాప్ స్టాక్ పిక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. బ్యాంక్ స్టాక్ వ్యాల్యుయేషన్స్ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, కొనొచ్చని సిఫార్సు చేస్తోంది. షేరు ధర రూ. 1150 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది.
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్!
అలాగే మరో బ్రోకరేజ్ సంస్థ అంబిత్ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ షేరును కొనొచ్చని సిఫార్సు చేస్తోంది. షేరు ధర రూ. 1025 స్థాయికి చేరొచ్చని అంచనా వేస్తోంది. బ్యాంక్ క్యూ2 ఆర్థిక ఫలితాలు కూడా అదిరిపోయాయి. నికర వడ్డీ ఆదాయం పెరిగింది. మొండి బకాయిల కేటాయింపులు తగ్గాయి. రుణ నాణ్యత మెరుగు పడింది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ షేరు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల కన్నా మెరుగైన పనితీరు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ షేరు గత ఆరు నెలల కాలంలో 25 శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇదేసమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ మాత్రం 12 శాతం మేర పైకి కదిలింది. అలాగే మరో బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌కు బై రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్‌ను రూ. 1090గా నిర్ణయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Icici bank, Share Market Update, Stock Market, Stocks