ICICI Bank: ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బులు డ్రా చేయండి ఇలా

ICICI Bank | మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి ఇకపై ఏటీఎం కార్డు అవసరం లేదు. ఇలాంటి కొత్త సర్వీస్‌ను అందిస్తున్నాయి బ్యాంకులు. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇలాంటి సర్వీస్ అందిస్తోంది. ఏటీఎం కార్డు లేకుండా ఎలా డబ్బులు డ్రా చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 17, 2020, 11:09 AM IST
ICICI Bank: ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బులు డ్రా చేయండి ఇలా
ICICI Bank: ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బులు డ్రా చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఐసీఐసీఐ బ్యాంక్ తన వినియోగదారులకు మరో కొత్త సౌలభ్యాన్ని ప్రకటించింది. భారత్‌లో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా గుర్తింపు పొందిన ఈ సంస్థ, తాజాగా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సదుపాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించింది. అంటే వినియోగదారులు ఏటీఎం కార్డులు లేకుండానే బ్యాంకు ఏటీఎంల నుంచి సురక్షితంగా, సౌకర్యవంతంగా నగదును డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ యాప్ 'ఐమొబైల్' ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 15 వేలకు పైగా ఉన్న తమ బ్యాంకు ఏటీఎంల నుంచి నగదును డ్రా చేయొచ్చని బ్యాంకు ప్రకటించింది. ఏటీఎం కార్డు వాడకుండా ఇలా సరళంగా, సౌకర్యవంతంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

రోజువారీ వినియోగానికి నగదు ఉపసంహరించుకోవడానికి డెబిట్ కార్డును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏటీఎం పిన్ నంబర్లు మర్చిపోవడం వంటి సమస్యలు ఎదురుకావు. దేశవ్యాప్తంగా ఉన్న 15,000 ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రోజువారీ పరిమితిగా నిర్ణయించిన రూ.20,000 వరకు నగదును ప్రతిరోజూ ఉపసంహరించుకోవచ్చు. iMobile యాప్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది సురక్షితమైన పద్ధతి. భద్రతాపరమైన సమస్యలు ఎదురుకాకుండా ఇది నిరోధిస్తుంది.

SBI ATM: అలర్ట్... ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు కొత్త రూల్

Savings Scheme: మీ డబ్బును రెండింతలు చేసే స్కీమ్ ఇదే

ముందు ఐసీఐసీఐ IMobile యాప్‌లోకి లాగిన్ కావాలి. దాంట్లో కనిపించే ‘సర్వీసెస్’ విభాగంలో ‘క్యాష్ విత్డ్రా ఎట్ ఐసీఐసీఐ బ్యాంక్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత విత్‌డ్రా చేయాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. అకౌంట్ నంబర్ ఇవ్వాలి. అనంతరం నాలుగు అంకెల టెంపరరీ పిన్ ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత వినియోగదారుడికి వన్ టైమ్ పాస్‌వర్డు వస్తుంది. తరువాత మీకు దగ్గర్లో ఉన్న ఐసీఐసీఐ ఏటీఎంకు వెళ్లి కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ఖాతాకు అనుసంధానం చేసిన ఫోన్ నంబరు, ఓటీపీ నంబరు, టెంపరరీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి నగదు మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. నగదు ఉపసంహరణ అభ్యర్థన, OTP మరుసటి రోజు అర్ధరాత్రి వరకు చెల్లుతాయి.

ఒక్కసారి తీసుకునే అత్యధిక మొత్తం, ఒక రోజులో తీసుకునే నగదు పరిమితిని రూ.20,000 గా నిర్ణయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా తన వినియోగదారులకు యోనో యాప్ ద్వారా కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: September 17, 2020, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading